*దృశ్య శ్రవణ అష్టావధానము - 6*
స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం, శుద్ధ పాడ్యమి
గురువారం, తేది 23-04-2020
నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*
౧) సమస్య - శ్రీ భూమయ్య గారు
౨) దత్తపది - శ్రీ రాజయ్య గారు
౩) వర్ణన - శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
౪) ఆశువు - శ్రీ రవికుమార్ గారు
౫) దృశ్యము - శ్రీ కొత్త మురళి గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీ మాడుగుల భాస్కర్ శర్మ గారు
౭) న్యస్తాక్షరి - శ్రీ పాద బాలాజి గారు
౮) పాటకు పద్యం - శ్రీ మహమ్మద్ షరీఫ్ గారు
ప్రార్థన
అవధానమ్మిది వాక్కులమ్మ దయతో నాన్లైను సాగించెగా
స్తవనీయమ్మగు ప్రశ్న వేయ నిడుదున్ సాహిత్య వాక్స్వాదువున్
రవళించున్ గద శబ్దశక్తివరలన రమ్యాక్షరీ భారతీ
హవనంబిద్దియెజాలువారు నిపుడా హ్లాదంబు నందించగన్
2.మరుమాముల దత్తన్నయు
సురుచిర సంయోజకుండు సొంపొలరారన్
చరవాణిన గొనసాగగ
వరనీయమ్ముగ నడుపుడు వందనమిదియే.
3.దృశ్య రూపమ్ముగశ్రవణ దీపికముగ
వరలు యవధాన కేళికి వాసితెచ్చె
అతడు గోగులపాటియై నవని నిలిచె
పద్యకవి యవధాన మై పరిమళించె
సిహెచ్. భూమయ్య,
తెలుగు భాషోపాధ్యాయులు,
నారాయణఖేడ్.
అంశము : సమస్య:
శవమును జూచినంత కడు సంబరమొందెను కన్నతల్లియే!
అవధాని పూరణ:-
*చ.*
ప్రవిమల మాతృభావనము భారత దేశపు కీర్తిహేతువౌ
ఛవినల విశ్వమంతటను చాటగ శక్తికుటుంబమందునన్
హవనమె పెంపకమ్ము గద హాయిగ పిల్లలెయాటలాడ, శై
శవమును జూచినంత కడు సంబర మొందెను కన్నతల్లియే!
వడ్ల రాజయ్య.
నారాయణ ఖేడ్.
దత్తపది.
పదాలు-సోమ.మంగళ. బుధ.గురు.....
వర్ణనాంశం- తెలుగు పద్యవైభవం.
అవధాని పూరణ:-
సోమచంద్రకల్ వెదజల్లు సొంపులలరు
దివ్య మంగళకరమైన భవ్యశక్తి
బుధులు మెచ్చెడి పద్యమ్ము పూర్ణమదియె
నవ్య గురువుల నాల్కపై నర్తనమ్ము
వరుకోలు లక్ష్మయ్య
తెలుగు భాషోపాధ్యాయులు
ZPHS గుర్రాలగొంది
జిల్లా సిద్దిపేట
తరువాతి:9704865816
*అంశం:వర్ణన*
*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు* *గారు కరోనా వైరస్ కట్టడిపై తెలంగాణ ప్రజలను జాగృతం చేయుచున్న సందర్భాన్ని వర్ణిస్తూ స్వేచ్చా ఛందంలో వర్ణించాల్సిందిగా మనవి.*
అవధాని పూరణ:-
మత్తేభం
సకలమ్మౌ ప్రజలింట నుండ జయమౌ సంతోషమే గల్గులే
వికలమ్మీ కరొనాను పంపమనదౌ వీరత్వమే దివ్యమౌ
అకలంక ప్రతిభా సమానులిచటన్ ఆత్మీయ సేవల్ నిడెన్
ప్రకటించెన్ గద కే.సి.యారు.ఘనుడై ప్రావీణ్యమౌ సూక్తులన్!
టి.రవికుమార్,యస్.ఏ.తెలుగు
జి.ప.ఉ.పా.ముదిమాణిక్,మం:పుల్కల్,జి:సంగారెడ్డి.
అంశం: అశువు
టి.రవికుమార్,
జి.ప.ఉ.పా,ముదిమాణిక్, సంగారెడ్డి.
నా అంశం:ఆశువు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేయడం కోసం లాక్డౌను ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు వచ్చేశాయికదా!ఈసందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులమానసిక స్థితి ఎలా ఉందో స్వేచ్ఛా వృత్తంలో వివరించండి.
అవధాని గారి పూరణ:
పిల్లలు భావిపౌరులనిపేరిమి బంధములల్లుకొన్నవా
రెల్లరుప్రేరణమ్మునిడెనిట్టుల వీడియొలందజేయుచున్
పిల్లలకిష్టమైనవివిప్రీతిగ మక్కువగల్గువాటిపై
నుల్లముజేర్చిసాధనమునొందె కరోనకు వందనమ్మిదే!
ధన్యవాదాలు
దృశ్య శ్రవణ అష్టావధానం-6
పృచ్ఛకుడు: డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ
కాళేశ్వరం
అంత్యాద్యక్షరీ
..................................
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్రనీ హరములకు
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు
వినుత గుణశీల !మాటలు వేయునేల!
అవధాని పూరణ:-
..................
లలిత భక్తులనిలయమ్ము లక్షణముగ
పరమ ముక్తిని యిచ్చును భక్తతతికి
చదువ పద్యమ్ము మనలను చక్కదిద్దు
దివ్యభాగవతమిదియె దీపితమ్ము.
జి.శ్రీపాదబాలాజి.
తెలుగుభాషోపాధ్యాయులు.సంగారెడ్డి.🙏🏻
అంశము:
న్యస్తాక్షరి - భా-ర-త-ము. నాలుగు పాదాలులలో ఉపయోగించి , రామాయణార్థంలో , స్వేచ్ఛా ఛందస్సులో పద్యాన్ని నిర్మించవలసిందిగా ప్రార్థిస్తూ వర్ధమాన అవధానికి నమస్సుమాంజలి.
జి.శ్రీపాదబాలాజి.
🌹 అవధాని గారి పద్యపూరణ.
భావి జగతికి సంస్కారం ఫలము లొసగు
రగులుగొల్ప నైతికా రామమదియె
తన్మయమ్ముగ జదువగా ధన్మతలరు
ముక్తి రామాయణమొసగు భక్తి విరియ. 💐
జై శ్రీరామ్🙏🏻
పేరు డా.మహ్మద్ షరీఫ్
భాషోపాధ్యాయులు తెలుగు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల తొగర్ పల్లి
మండలం కొండాపూర్
పాటకు పద్యం
పాట: ఓహో మేఘమాల
అవధాని పూరణ:-
తే.గీ:
చెలికి సందేశ మంపవె కలికి తునక
హృదయ భావంపు గొంపోవు సదయ మతిన
నన్ను మురిపించు చెలిజేర్చు మన్న వినిన
మేఘ చయమది నవ్వెను మిక్కు టముగ
కొత్త మురళి
సంగారెడ్డి జిల్లా.
దృశ్యం
అవధాని పూరణ
పుస్తకములెనాడు నడిపె
మస్తకమున్ నడిపెనేడు మహిచరవాణుల్,
విస్తారమ్ముగ మెదడులు
కుస్తీలే రెంటిమధ్య కొనసాగించెన్!!
పృచ్ఛకుల అభినందనలు
స్పందన
దృశ్యశ్రవణమైన దీప్తిలోనవధాన
ధారలు ప్రవహించె ధారణలుగ
భానుప్రకాశమీ వాట్సాపు మాధ్యమ
సాహిత్యవీధినాశ్చర్య పరచె
సంయోజకత్వమ్ము సాగె దత్తాత్రేయ
వాణితో తెలుగు సంవర్ధితమ్ము
గోగులపాటి సత్కూర్పులు నిండిన
కృష్ణమోహన రూప కీర్తియుతము
సకల సంపూర్ణ సత్కవిసంతసముగ
అద్భుతమ్మగువిధముగా అడిగినట్టి
ప్రాశ్నికుల ప్రశ్నలకుజెప్పె ప్రజ్ఞతోడ
ధన్యవాదములందరు మాన్యులకును.
..డా.మాడుగుల భాస్కర శర్మ
కందపద్యం.
ప్రవిమల దత్తాత్రేయులు,
కవి గోగులపాటి కృష్ణ గారల కృషితో,
యువకవి వధాని భానుని
కవితలు పొంగారె నేడు కమనీయమునన్.
...వడ్ల రాజయ్య.
SA Telugu.ZPHS కల్హేర్,నారాయణ ఖేడ్
పద్యం.
🌹🌹🌹🌹🌹🌹
దృశ్య శ్రవణ ఆన్లైన్అవధాన రూపకర్త శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ అన్నకు,
బహుముఖ ప్రజ్ఞాశాలి, అవధాని, సంయోజకులు ,బ్రహ్మశ్రీ మ.దత్తాత్రేయశర్మగారికి,
నేటి కార్యక్రమ సూత్రధారి వర్ధమాన అవధాని శ్రీ భానుప్రకాశ్ గారికి,
నాతోటి పృఛ్ఛకవర్యులకు,
ఈ అవధానంలో నాకు అవకాశం కల్పించిన ప్రాజ్ఞులకు శిరసా నమామి.
ఆదర్శంగా, ఆహ్లాదంగా,కర్ణపర్వంగా , అద్బుతంగా అవధానం విజయం చేశారు.
అభినందనలు.💐🌹👌🙏🏻
నేడు గురువారం దత్తునివారం-దత్తన్నకు వందనం.
🌻🌻🌻నాపద్యం.🌻🌻
☀భారతము పదాలు
పాదాదులను జేర్చి
రమ్యరచనజేసె రామఘనత
భాను సమయబుద్ధి భాసిల్లెనాన్లైన్లొ
దత్తమోహనాట ధరను వరలె.
💐👌👌👌🌹🙏🏻నమ్రతతో, భాషా సేవకుడు
జి.శ్రీపాదబాలాజి.సంగారెడ్డి.
అవధానము దిగ్విజయం చేసిన అవధాని భానుప్రకాశ్ గారికి సంయోజకులు,బ్రహ్మ శ్రీ మరు మాముల దత్తాత్రేయ శర్మ గారికి,నిర్వహకులు శ్రీ గోగుల పాటి కృష్ణ మోహన్ గారికి అభినందనలు.
అవధానిపై అభినంద పద్యాలు
*కం.*
*ఏమా?కవితా శిల్పమ*
*దేమా!పద్యపు నడకది యెన్నో జిలుగుల్!*
*ఏమనియందును మిత్రమ*
*యేమా!పద్యవిభవమది యెంతో ఘనమై!*
*కం*
*కావ్యకళానిధివై!భువి*
*భవ్యామృతభానుతేజ భాగ్యంబలరన్*
*నవ్యపు రీతిని కైతలు*
*సవ్యంబుగనల్లినావు సరసులు మెచ్చన్!!*
*కం*
*చక్కని మీయవధానము*
*నక్కజముగసాగెనేడు నద్భుత భంగిన్*
*చిక్కని పద్యపు శిల్పము*
*చెక్కుటలో భానుమిన్న చేయుదు ప్రణతుల్*
మీ
సిహెచ్.భూమయ్య,
నారాయణఖేడ్.
సంయోజకులు.శ్రీ.మరుమాముల దత్తాత్రేయశర్మ గారు మరియు అవధాని శ్రీ .అవుసుల భానుప్రకాశ్ గారుమమ.మరియు ఈకార్యక్రమానికిమూలమైన శ్రీ. గోగులపాటి కృష్ణమోహన్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈకార్యక్రమం పై చిరు స్పందన.
సంయోజకులవారిపై...
*మరుమాముల పండితులూ
పరమోన్నతమైనరీతి ప్రజ్ఞతొ నడిపెన్!
సరియగు సవరణ జేయుచు
మురిపించువిధంబుజేసె మోదముగలుగన్!*
అవధాని గారికి అభినంధన...
*కనివిని యెరుగని తీరుగ
వినిపించిరిపద్యములను వేడుక తోడన్ ఘనుడైన భానుగారికి
వినయంబుగ జేయుచున్న విరివిగ ప్రణతుల్!*
ధన్యవాదాలు
టి.రవికుమార్ ,
భాషోపాధ్యాయులు,
జి.ప.ఉ.పా.ముదిమాణిక్,మం:పుల్కల్,సంగారెడ్డి.
దృశ్య శ్రవణ అష్టావధానము
అభినందన పద్యాలు
అవధాని శ్రీ భానుప్రకాశ్ గారికి
కం:
అవధానము దృశ్య శ్రవణ
రవళించగజేసె "భాను" రమ్యత భంగిన్!
కవిగా యవధానిగ తాఁ
సవినయముగ నొప్పు చుండె సాహితి జగతిన్!
శ్రీ మరుమాముల దత్తాత్రేయ
శర్మ గారికి
కం:
కన్నుల కనుపడు నట్టుల
మిన్నగు యవధాన మిపుడు మేలుగ బంచన్!
నెన్నగ మరుమాముల తా
వన్నెల సంచాలనమ్ము వాట్సాప్ నందున్!
శ్రీ గోగుల పాటి కృష్ణమోహన్
గారికి
కం:
శ్రీ గోగుల పాటికృష్ణుడ
సాగెను యవధాన మిపుడు సరసులు మెచ్చన్!
వాగీశ్వరి కరుణామృత
సాగరమే యండ మీకు సద్గుణ హితుడా!
డా.మహ్మద్ షరీఫ్
సంగారెడ్డి 9866560527
యూట్యూబ్ లింకు కొరకు
https://youtu.be/TtL6Zoy-v24
స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్
స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం, శుద్ధ పాడ్యమి
గురువారం, తేది 23-04-2020
అవధాని
శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు
సంయోజకులు
బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు
నిర్వహణ
శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

దృశ్య శ్రవణ అష్టావధానానికిరూపకల్పనజేసినశ్రీ గోగులపాటికృష్ణమోహన్ గారికి, వర్ధమాన అవధాని శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారి అవధానం ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది.సంయోజకులు మరుమాములదత్తాత్రేయశర్మ వ్యాఖ్యానం బాగుంది ఈకార్యక్రమం ఇంకా దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్న...
ReplyDeleteవరుకోలు లక్ష్మయ్య సిద్ధిపేట
Nice
ReplyDeleteNice
ReplyDeleteనిధాఘంలోపద్యపాదులకునీరందించినసాహితీవేత్తలందరికిఅభినందనలు.
ReplyDeleteఅవధానవర్ధిష్ణువులైనభానుప్రకాశ్ గారికిప్రత్యేకాభినందనలు.
ReplyDeleteడి.సి.నరసింహులు
మేడ్చల్.