Sunday, April 19, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 2

దృశ్య శ్రవణ అష్టావధానము - 2

స్వస్తిశ్రీ శార్వరీ నామ సంవత్సరము,
ఉత్తరాయణము, వసంతృతువు,
చైత్ర బహుళ ఏకాదశి,
శనివారము...

అవధాని

బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ

సంయోజకులు

శ్రీ అష్టకాల విధ్యాచరణ్


నిర్వహణ
గోగులపాటి కృష్ణమోహన్

*పృచ్ఛకులు*
సమస్య : మాడుగుల నారాయణ మూర్తి గారు
దత్తపది : డా|| రామక కృష్ణమూర్తి గారు
వర్ణన : మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ గారు
ఆశువు : అమరవాది రాజశేఖర శర్మ
శ్లోకానువాదం : డా|| ముదిగొండ అమరనాథ శర్మ గారు
అంత్యాద్యక్షరీ : జ్ఙానప్రసూన గారు
దృశ్యం : గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
నిషిద్దాక్షరీ : మాడుగుల భాస్కరశర్మ గారు

స్వాగతమీవధానబుధవర్యులుశంకరశర్మగారికిన్
జాగృతి తెల్గుభాషసహజాతమువెన్నెలకాంతిరేఖలై
మీగడసున్నితంపుపదమేవిధిహాయినిగూర్చునోగదా
రాగలయాన్వితంపురసరంజితమైసభ కీర్తిపొందగన్
మాడుగుల నారాయణ మూర్తి

బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ

దైవ ప్రార్ధన

సమస్య

మాడుగుల నారాయణ మూర్తి గారు

సమస్య:
గౌరీశంకరుడేకరోనవలపై కల్యాణమాడెన్గదా

అవధాని గారి పూరణ:-
సారాచారవిచారదక్షుడైసర్వంసహామండలిన్
శ్రీరమ్యుండై వెల్గువేల్పు విషమున్ క్షీరమ్ముగాద్రాగితా
పేరున్గాచెను శంకరుండుననువై భీతిన్ కరోనానుతా
గౌరీశంకరుడే కరోన వలచెన్ కల్యాణమాడెన్ గదా!!

అంశము : దత్తపది

రామక కృష్ణమూర్తి
దత్తపది
ఆది, సోమ, మంగళ, బుధ - అనే పదాలను ఉపయోగించి భాగవతార్థం వచ్చే విధంగా, ఏదేని వృత్తంలో తెలుపగలరని మనవి🙏


అవధాని గారి పూరణ:-
ఆదిపురాణపురుషుడు ఆ  యుగకర్తయే కృష్ణమూర్తియౌ
వేదము సంగ్రహించి పరువేగగా సోమకు ద్రుంచివేసి ని
ర్వేదకరుండు రాక్షసుని వేగమె చంపుచు మంగళాత్ముడౌ
మోదము గూర్చె భక్త బుధ మోహనరూపుని అంజలించెదన్


వర్ణన

మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ గారు

అంశము : వర్ణన :-
భక్తులతోకిటకిటలాడే
బాసరదేవాలయములో భక్తులు లేక
సరాసరి
గౌరీశంకరన్నకలములోచేరిన
అమ్మవారిని వర్ణన

అవధాని గారి పూరణ
ఈతరిలోకభీకరము యీకరుణాగతవేళలోనస
ఛ్ఛేతమునందునుండి విెశిష్టగుణోజ్వల వాసరేశ్వరీ
నేతలులేకచేసేడి పనేమియులేకకలంబులౌ
ఖ్యాతిగవచ్చిచేరెనను కారణమున్ సృజియించినావు
ఆ మాతసరస్వతీ రుచీరమాన్ర వచౌమకరందధారలున్
భ్రాతకునిన్నునన్ను  పరివారమునందరి బ్రోచుగావుతన్

ఆశువు

అమరవాది రాజశేఖర శర్మ
 ఆశువు...ఈ మాసం రోజులుగా తిరపతి వేంకటేశ్వరుని మనోగతం ఆశువుగా చెప్పండి

అవధాని గారి పూరణ
అరయగ మాసమంతటను హాయిగ భక్తులు లేకపోవుటన్
తిరుపతి వేంకటేశ్వరుడు దివ్యముగా తన కాంత తోడుతన్
స్థిరముగ కూరుచుండెనట చిత్తమునందున బాధలేకయున్
వరుసలవేమిలేవు మరి వాదనలున్ వినిపించబోవుగా
కెరిసెడికాసులేదయిన కూర్చెనుమానసిక ప్రశాంతతే


శ్లోకానువాదం : 
డా|| ముదిగొండ అమరనాథ శర్మ గారు

శ్లోకానువాదం
యా దేవీ సర్వభూతేషు విష్నుమాయేతి శబ్దితా | నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ
అవధాని గారి పూరణ
ఏదేవిసర్వ భూతములాధారముగ వసించునఖిల జగంబుల్ ఆదేవిమాతృమూర్తికి  శ్రీదేవికి వందనములు స్థిరముగ జేతున్ డా ముదిగొండ శ్లోకాను వాదం

అంత్యాద్యక్షరీ
జ్ఙానప్రసూన గారు

అంత్యాద్యక్షరి
సీసమాలిక.
**********
రామునిచరితమ్ము రమణీయ మౌనట్లు
          రచియించె కవయిత్రి రమణి మొల్ల
స్వాతంత్ర్య సంగ్రామ సారిణి యైతాను
          రణరంగ మునదూకె రాణిఝాన్సి
కాకతీయులరాజ్య ఘనతను పెంచిన
          రుద్రావ తారిణి రుద్రమాంబ
కోటివీణలుమీటు కోయిల స్వరమున
          జనులమదినిదోచె జానకమ్మ
మానవ సేవయే మాధవ సేవని
    మహినితెలియజేసె మదరు థెరిస
పటిమతోడనుదేశ పాలన చేసిన
       ఇంతిగావెలుగొందె నిందిరమ్మ
తే. గీ.
*****
నాటి నుండియు గొప్పగా నేటివరకు
అన్ని రంగము లనుగూడ నధిగమించి
విశ్వ సుగతిని చాటిన వెలదులార
అందు కొనుడమ్మ యివియెమా వందనాలు

*రచన** *జ్ఞాన ప్రసూనాశర్మ*  *ఎల్లికంటి*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అవధాని గారి పూరణ:-

లేములనుబాపి రక్షించు లేములాడ
వేద సంస్కృతి సుమమాలవేములాడ
రాజ రాజేశ్వరస్వామి (దే) రాజ్యమాడ
మహిత బంగరు తెలగాణ మధురవీణ

అంశం... దృశ్యం
దృశ్యం : గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

అవధాని గారూ నమస్కారం. ఈ దృశ్యం పై మీ స్వేచ్ఛా ఛందంలో పద్యమందీయండి.

దృశ్యం
అవధాని గారి పూరణ
ఆకరోనకు యువతులు నదిరిపడగ
నట్టిచిత్రము మనకు చూపెట్టినట్టి
యానకాశి చిత్రము నద్భుతముగ
తీర్చిదిద్దిన ఘనునికి దివ్యనతులు


అంశం: నిషిధ్ధాక్షరి

మాడుగుల మురళీధర శర్మ

ప,ఫ,బ,భ,మ అనే ఓష్ఠవ్యములు లేకుండా
రామాయణం గూర్చి స్వేచ్ఛా వృత్తంలో ఒక పద్యం చెప్పగలరు.

అవధాని గారి పూరణ



గౌరీశంకరశర్మ‌ అవధానిగారు నేటి అష్టావధానాన్ని‌ చాలా బాగా చేసారు. అన్ని అంశాలను‌ కడు సమర్థవంతంగా,అర్థవంతంగా,ఆహ్లాదంగా పూర్తిచేసారు.వేగం,స్పష్టత,ప్రామాణికత వారి సుగుణాలు.కర్ణపేయంగా ఉంటుంది వారి గానం.సమయస్ఫూర్తి, రసరమ్యత,చమత్కారం వారి అవధానానికి అలంకారాలు.అలవోకగా అష్టావధానాన్ని పూర్తిచేసిన అవధానతిలకునకు అభినందన విజయ మాలలు.

డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.


అందరికీ వందనాలు.దృశ్యశ్రవణ అవధానం చాలా చక్కగా విజయవంతమైంది.రూపకర్తలు గోగులపాటివారికి,సంయోజకులు అష్టకాల వారికి,అవధానిగారికి  శుభాభినందనలు.సమీక్ష కాకుండా. చిన్న ప్రతిపాదన.కొంతసమయం ఎదిరిచూడవలసి వచ్చింది.కొంచెం మార్పుతో సమన్వయకర్తలు/సంయోజకులకు పృచ్ఛకులు వ్యక్తి గతంగా వీడియో పంపిస్తే క్రమానుసారంగా ఒక్కొక్కటి వారు బృందంలోకి పంపాలి.అవధాని గారి సమాధానం రాగానే రెండవది పెట్టాలి.ఇలా అయితే సమయం క్రమబద్ధమౌతుంది.ఆలోచించగలరనివినతి.మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా


[19/04, 8:49 AM] Poet Prasoona Sharma: శివపూజాదురంధరులు, సౌమ్యులు , అవధానతిలక  బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారికి శతాధిక  వందనాలు.
     ఆన్లైన్ ద్వితీయ అవధానాని అలవోకగా ,అద్భుతంగా చేశారు. అవధాన సరస్వతులను అభినదించడానికి కూడా నాఅర్హత చాలదేమో.
     శ్రీకృష్ణమోహన్ గారు నూతన కార్యక్రమాన్నీ సృష్టించి   ఈకార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చెయ్యడం నాసుకృతం.వారికి అభినందనలు.
       సంయోజకులు విద్యాచరణ్ గారు పద్యరచనలో ఘనులు. స్నేహశీలి. కార్యక్రమాన్ని చక్కగా. సమన్వయం చేశారు.
 
అమరవాది రాజశేఖర శర్మ గారి అభినందనలు

ఈ దృశ్య శ్రవణ అవధానము యూట్యూబ్ లో వీక్షించుటకొరకు ఈ క్రింది లింకును క్లిక్ చేయండి

https://youtu.be/AmLIhrp5kaA
అందరికీ  నా హృదయ పూర్వక. అభినందనలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 గోగులపాటి కృష్ణమోహన్ ✍🏼: 

No comments:

Post a Comment