శ్రీగణపతయేనమః గురుభ్యోనమః
అవధాన సరస్వతి కి నమస్సులు
శతపవధానముచేసిన
శతపథసాహిత్యపద్య శతఛందాబ్జా! ప్రతిపద్యముహృద్యమ్మే
శతవందనమందజేతు సన్నుత కృష్ణా!
అవధానశిరోమణిగా
కవనముసాగించినారు కారణపురుషా
కవికులముకు ఘనతరువుగ
వరమైవాణీ స్వరూప వందనమిదిగో
వందనమిదె యవధానికి
వందనమిదె పృచ్చకులకు వాణీసుతుల్
సుందరమగు పద్యములతొ
మందిరముగ నిలిపిరంత మానసమందున్
వెన్నంటియున్నవారికి
మన్ననజూపించువారి మైత్రిని గనగా
మిన్నంటినసంబరమును
కన్నులజూపించెనేడు కాంక్షగ కృష్ణా
స్వఛ్ఛమనస్సునమొదలిడి
కృఛ్ఛత్రయసావధాన గీర్వాణిదయన్!
యిఛ్ఛాఛందోసాహితి
పృఛ్ఛకగణమాన్యతమ్మె ప్రేమక కృష్ణా!
వాణీకృపచేనేడిట
మాణ్యుల సంగమముపొంది మాధుర్యముతో
పాణినిగలపాండిత్యము
శ్రోణిగ నీపద్యధార సౌమ్యముకృష్ణా
ఊహించని మధురానుభవం... ఒక ఆత్మీయతను పంచేవాట్సప్ సమూహం ఎర్పాటు... అందులో కవులందరూ చేరిక. అందరి ఆదరణ అనూహ్యంగా.. సాగింది... ముఖ్యంగా అవధాన ప్రక్రియ అంటూ ఒకటి ప్రారంభిస్తానని కలలో కూడా ఊహించలేదు...
అందుకు ముందుగా ఆ సకళకళావాణికి వందనములు సమర్పిస్తున్నాను.
అనుకోకుండా ఆరంభించిన
ఆత్మీయసమూహంలో కథలు, కవితలు, పద్యాలు. రచనలు కొనసాగుతున్న నేపథ్యంలో కవులు సమస్యా పూరణాలు, దత్తపదులు పెడుతుండటంతో అదేదో మనమే చేసుకోవచ్చు అనే అలోచన తట్టింది.
ఆ సమయంలో మన సమూహంలో ఉన్న నేటి మన అవధానిగారు అమ్మవారి సేవలో నియమనిష్టలు గలవారు. అనేకశాస్తాలను తెలిసిన వారు. బ్రహ్మశ్రీ గౌరీభట్ల బాలముకుంద శర్మ గారు తమపద్యాలతో పాండిత్యంతో సమూహంలో ప్రత్యేక స్థానంలోఉండటం గమనించాను.
అదే సమయంలో వారు ఒక అవధానంలో వారు పూరించిన సమస్యను సమూహంలో పెట్టడం... నేను వెంటనే వారిని అవధానం నిర్వహించుకుందామని కోరడం... దానికి వారు శుభమస్తు.. అని పలకడంతో తేది ..31-01 2019 న సాయంత్రం 7 - 9గంటల వరకు మొట్టమొదటి ఆన్లైన్ అవధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టయ్యింది.
నాటిమొదలు .. నేటి వరకు అనగా 10-5-2019 శనివారం వరకు అమ్మవారి కృపాకటాక్షాలతో... నిరంతరాయంగా, నిర్విఘ్నంగా నిత్యావధానం కొనసాగటం హర్షనీయం. అభినందనీయం, ఆనందదాయకమనే చెప్పాలి
వారి అనుష్ఠానమసయం అవధానసమయం ఒకటే కావడంతో.. అవధానంలో శంఖానాదంతో పాటు రోజుకో ఛందస్సులో.. గణపతి ప్రార్థన తో కొనసాగేది.. అనుకోకుండా ఒకనాడు అవధాన మిత్రులు సోదరులు మల్లావఝ్ఝుల చంద్రశేఖర్ శర్మ గారి నోటి వెంట వాట్సాప్ 100 అవధానాలు అనేమాట రావడంతో అందరూ దానికి సంఘీభావం తెలుపడం... అవధాని గారు ఆమోదం తెలుపడంతో సంకల్పమేలేని అవధానప్రక్రియ కొత్త మలుపు తిరిగింది.
శతపద్యాలు శతఛందస్సులతో పుస్తకం చేయాలనే ఆలోచన కూడా అవధానంలో ప్రార్థననే కారణంగా చెప్పవచ్చు..
అందుకు ముందుగా అవధాని గారికి శతధా... సహస్రధా నమస్సుమాంజలిలు.
నా సమన్వయంలో కొనసాగుతున్న అవధానాలు.. ఎనమిది అంశాలు దాటిమరో మూడు చేరడం అవి.. దృశ్యం, ఆకాశపురాణం, ఆద్యంత్యక్షరీ తో రోజుకు ఏకాదశాంశాలతో అవధానం
ఆకర్షణీయంగా కొనసాగింది... అవధానం అంటే అందరికీ ఉత్సాహంగా సాగే మహత్తర జ్ఞాన భండాగారంగా మారింది. దినదిన ప్రవర్ధమానమైంది.
అవధానాలలో విషిష్టస్థానాన్ని పొందిన రోజులు ఉన్నాయి అవి ఒకటి) తేది 3-3-2019 మహాశివరాత్రి నాడు అవధానంలో రాని అంశాలు లేవనే చెప్పవచ్చు... శివతత్వం, శివతాండవం, శివపురాణంలోని శివావతారాల వివరణ.. ప్రళయ ప్రణయ తాండవాల విశిష్టత.. ఇలా శివరాత్రి జాగరణతో తెల్లవారి 4 గంటల వరకూ తెలియకుండా నే అవధానం కొనసాగింది.
అదే విధంగా మార్చి 8వ తేదీన మహిళాదినోత్సవం సందర్భంగా సమూహంలో ని మహిళామణులచే ప్రత్యేక అవధానం విశేషంగా జరిగింది.
ఆరోజు వారి సంతోషం అద్వితీయమైనది.
అలాగే పుల్వామా దాడిలో వీరజవానుల మరణం... ఘటనపై ఒక అవధానం చాలా ఉత్కంట భరితంగా సాగి పద్యాలలో .. సైనికార్చనచేసింది.
ఎప్రియల్ 6 న ఉగాది. పర్వదినాన్ని పురస్కరించుకొని వసంతమానం, పంచాంగశ్రవణం, మొదలైన అంశాలతో పద్యాల పరంపర అద్భుతంగా... షడ్రుచుల సమ్మేళనంగా కొనసాగింది.
శ్రీరామనవమీ.. కళ్యాణం పై, హోళి.. ఇలా అన్ని విశిష్టతలను సంతరించుకుంది ఈ వాట్సప్ వేదికగా జరిగిన నిత్యావధానం.
ఇటు ఆధ్యాత్మికంగా, అటు సామాజిక మైన
విషయాలతో అన్నీ క్రోడీకరించుకుంటూ అవధానాలు కొనసాగుతున్న క్రమంలో రానురానూ.. పృచ్చకగణం ఇచ్చిన అంశాలను రెండు మూడు నాలుగు.. ఇలా కలుపుతూ ఓకే పద్యంలో రావడం...అవధానిగారి అనన్యమైన, అసామాన్యమైన పాండిత్యానికి.. తార్కాణం గా చెప్పవచ్చు.
తేది 11-4-2019 రోజు.. అన్ని(8)అంశాలను ఒకే పద్యంలో రావడం..సాక్ష్యం గా చెప్పవచ్చు... మీ కోసం అదొక్కసారి పెడుతున్న చూడండి...
1.వర్ణన (ఎన్నికల్లో అవినీతి) +
2.అంత్యాద్యక్షరి (మున్) +
3.ఆశువు (ఎన్నికలవిధుల శ్రాంత స్థితి నుంచి అరుంధతీ & వెన్నెల లను ౘూస్తూ విశ్రాంతి) +ౕ
4.దృశ్యము- రాజరాజేశ్వరీదేవి, +
5.నిషిద్ధాక్షరి (ధ,నం,డ,బ్బు)+
6.న్యస్తాక్షరి 1-1న,2-3ర,3-6ద,
4-చివర మ, నరేంద్రమోడీ గూర్చి,
7.దత్తపది(బంగారం, సింగారం,
వయ్యారం,నయగారం+
8. సమస్యా పూరణము...
నన్నుఁగావగనీవు నయగారమేఁౙూపి
మోహరమునొసగి ముంౘనేల
ఎన్నికలన్నుదన్నెన్నికలలదేల
వస్తుప్రలోభ వివాదమమ్మ
బంగారు వయ్యారి సింగార హొయల ప
తివ్రతా తార వెన్నెలలఁౙూడ
నీ ఫాల శశిరేఖ నిజమైన శాంతిని
చ్చెనలసటలనుఁదీర్చెను ప్రణతులు
ఒకడు దామోదరయన దాసోహమనుౘు
భారతీయులకరులైన వారిపైన
కొండనెత్తిన హరియె నాకొంపకూల్చె
ననుౘు జయమునుఁ గోరెనిమ్రానుఖాను
రాజరాజేశ్వరీ! కృపా లాస్యమిదియె
అగ్గికి ఆజ్యం పోసినట్టు పృచ్చకగణం కూడా ప్రతిభకనబరుస్తూ.. రోజు రోజుకు ఆసక్తి గా పాల్గొనడం చూసిన అవధాని గారు .. వారిలో మరింత పద్య రచనలో పఠిమ పెంచడం కోసం ఉత్తమ ప్రాశ్నికులుగా.. పద్యప్రశంలవర్షం కురిపించారు...
అంతేకాకుండా అప్రస్తుతాలకు సైతం అందమైన పద్యాలు.. అందిస్తూ... ఆకాశపురాణం లో.. వైదిక, దైవిక విషయాలలో ఎంతో లోతైన సమాచారాన్ని అందిస్తూ... అందరికీ శాస్త్ర విషయ పరిజ్ఞానం లో ఆసక్తిని తట్టి లేపారు, మాలాంటి వారికి తెలియని ఎన్నో ధార్మిక విషయాలను తెలియజేశారు.
ఇలా సాగుతున్న అవధానంలో పెద్దలు పండితులు మరో ఇద్దరు అవధానులు శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు, డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ గారు సమూహంలో చేరటం.. వారి ప్రోద్బలంతో అవధానాలే కాదు..
సంస్కృతపాఠం కూడా సమూహంలో అందరూ నేర్చుకునేలా ప్రేరేపించడం వలన సమూహానికే కొత్త శోభను చేకూర్చాయి అని చెప్పవచ్చు.
ఆ జ్ఙానసరస్వతీ దేవికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను... ఇందులో భాగంగానే.30-4-2019 న సమూహంలో తొలిసారిగా.. సంస్కృత అవధానం జరిగింది.. అందులో అందరూ ఆసక్తి గా పాల్గొన్నారు.. విశేషమైన పద్యాలు రావడం జరిగింది. అదే ఉత్సాహంతో సమూహంలోని వారు ఒకరోజు కేవలం గళం ద్వారానే అవధానం కొనసాగించడం జరిగింది... ఆరోజు పృచ్ఛకులు, అవధానిగారు ఆలపిస్తూ... అలరిస్తూ.. పద్యాలను అందించడం ఒక ఆకర్షణ అని చెప్పవచ్చు.
రత్నాల వంటి పద్యాలతో.... ఎన్నో ఎన్నదగిన పద్యరత్నాలను ఈ వాట్సాప్ శతావధానంలో అందించారు. ఇప్పటికి100 అవధానాలలో
రోజు రోజుకూ పెరిగిన పృచ్చకగణం సంఖ్య 37 దాటిందనే చెప్పవచ్చు.
ఇక అవధానంలో పద్యాల పరంపర విషయానికొస్తే... మనం ఒక శతకం రాయాలంటేనే ఎంతో కష్టపడుతాము అలాంటిది అవధానిగారు ఈ అవధానంలో పృచ్ఛకుల అంశాలకు అందించిన పద్యాల సంఖ్యే సుమారు 1000 పద్యాలు అంటే సామాన్యమైన విషయం కాదు. అదీ పృచ్ఛకులు అడిగిన ఛందస్సులలో అలవోకగా అందించడం విశేషం.
పృచ్చకులవి 455 పద్యాలు కలుపుకుని మొత్తం ఈ వంద రోజులలోనే దాదాపు 1455
పద్యాలతో నిత్యావధానం మారుమ్రోగిపోయింది అని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా పద్యాలు అందించిన అందరికీ పేరుపేరునా వందనాలు సమర్పిస్తున్నాను..
మొత్తానికి ఈ తరుణం ఒక మహత్భాగ్యంగా భావిస్తున్నాను. ఎక్కడా కనీ వినీ ఎరగని రీతిలో చరవాణియే మా వాణియై
మాకు మార్గం చూపింది...
అందరూ... ఆనందించదగ్గ... హర్షించదగ్గ ఒక గొప్ప అనుభూతిని మాకందించింది...
వాట్సప్ చరిత్ర లో నిలిచిపోయే ఘనతను మిగిల్చింది
ఏదీ ఒకరితో కాదు నలుగురి కలయిక కష్టం తెలుపదు అన్నట్లు... ఈ కార్యక్రమనిర్వహణ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రణతులు...
ముఖ్యంగా నాకు సమన్వయంలో సహాయసహకారాలు అందించి.. అందరినీ అన్నివేళలా ఆనందంగా ఉంచేందుకు కళంతో... గళంతో తమ ఉనికిని చాటుకున్న శ్రీమతి తిగుళ్ళ (మంచినీళ్ళ) సరస్వతి గారికి, సోదరుడు మల్లావఝ్ఝుల చంద్రశేఖర శర్మ గారలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
నాకు ఎంతోకాలంనుండీ సాహితీ మిత్రులుగా సహకారం అందిస్తూ వస్తున్న కవిమిత్రులు మామూశ గారికి, అరాశ గారికి, కాంతికృష్ణ గారికి, రామక కృష్ణమూర్తి గారలకు కృతజ్ఙతాభి వందనాలు.
ఇంకా ఈ అవధానంలో పృచ్చకులుగా పాల్గొని తమ సంపూర్ణ సహకారం అందించిన పృచ్ఛక మహాగణం సభ్యులు సింగీతం నరసింహ. రావుగారు, వేదాంతం సురేష్ బాబు గారు, చెన్నై రామమూర్తి గారు, అష్టకాల విద్యాచరణ్ గారు, జబర్దస్త్ లక్మీకిరణ్ గారు, నందబాల శర్మ గారు, మాడుగుల భాస్కర్ శర్మ గారు, శరత్..శారదాప్రసాద్ గారు, కళ్ళె నర్సింహం గారు,రాచర్ల వేణుమాదవ్ గారు మరియు...
పృచ్ఛక మహామణులు రంగరాజు పద్మజ గారు, దోర్భలబాలసుజాతగారు, జ్ఞానప్రసూనగారు, లక్ష్మీ మదన్ గారు, పార్నంది లలిత కృష్ణ గారు, పద్మ త్రిపురారి గారు, చిగురాల పద్మగారు, గుమ్మన్నగారి బాలసరస్వతి గారు, వేలేటి శైలజ గారు, చీదెళ్ళ సీతాలక్మిగారు, జలజారాణిగారు, చుక్కాయపల్లి శ్రీదేవి గారు, కొల్లూరు పద్మజ గారు, వనజ గారు, సింగీతం సంధ్యారాణి గారు, నూతనంగా చేరిన లక్ష్మీ పద్మజ గారు మరియు అవధాని గారి కూతురు కౌళిని గారలు... ఈ నిత్యావధానంలో పాల్గొని తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సమూహానికి, మన అవధానానికి ప్రత్యేక గుర్తింపు రావడానికి దోహదపడ్డందుకు అందరికీ పేరుపేరునా ప్రణామాలు అర్పిస్తున్నాను.
ముఖ్యంగా వారు పేరొందిన అవధానులే అయినప్పటికి ఎప్పుడో మన సమూహంలో చేరాల్సినవారే.. కానీ వారి కూతురు వివాహం సందర్బంగా మన సమూహంలో ఆలస్యంగా వచ్చి తన బాల్యమిత్రుడి అవధానాన్ని ఆసక్తిగా ఆలకిస్తూ... అవధాని అయ్యుండికూడా ఒక పృచ్ఛకునిగా నిత్యం పాల్గొంటూ... సంస్కృత అవధానానికి తెరలేపి... ఆ పద్యాల భావాలను తెలుగులో తెలియజేస్తూ... తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అవధాన సరస్వతి శ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు... అదే విధంగా జంట అవధానులలో ఒంటరిగా చేరారనే బాధ మన మదిలో తొలువకుండా... పెద్దలు అవధాని వర్యులు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ గారు కూడా మన సమూహంలో చేరి తోటి అవధానికి అభినందిస్తూ... అవధానంలో పాల్గొన్న వారి సాదరప్రేమకు పాదాభివందనం చేస్తున్నాను...
ఇక వందవ అవధానం సమీపంలో మన సమూహంలో అడుగిడిన పెద్దలు హారినాథశర్మ గారు, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారల రాక సమూహానికే వన్నె తెచ్చిందని భావిస్తూ... వారికి వినమ్రపూర్వక వందనాలు.
ఇక మొదలే చెప్పుకున్న వ్యక్తి.. కాదు ఒక శక్తి అనే చెప్పవచ్చు... నిద్రా.. ఆహారాలు మాని, పండుగలు, ఉపవాసాలు ఇలా అన్ని పర్వదినాలలో... ప్రయాణాలలో.. పురాణపఠనాలలో ఇలా ఎక్కడున్నా... పృచ్చకులు తమ అంశం ఇచ్చి సమూహానికి దూరంగా ఉన్నా... తను మాత్రం ఏరోజు... యే అంశాన్ని వదలకుండా... ఎంతో శ్రద్దగా... సరస్వతీ దేవికి అక్షరార్పణగా భావిస్తూ వందరోజుల అవధానాన్ని అప్పుడే వందరోజులు అయిపోయావా అన్నచందంగా ఛందోబద్దంగా పూరణలు అందించిన అభినవ శుక పండితులు, సమన్వయ సార్వభౌములు, అవధాన సరస్వతులు శ్రీ గౌరీభట్ల బాలముకుంద శర్మగారి అపార పాండిత్యానికి చేతులెత్తి వారి నమస్కరించడం తప్ప మరేవిధంగా కృతజ్ఙతలు తెలుపాలో అర్ధం కావడం లేదు.
సమూహంలో ఉన్న పండితులు, ఆత్మీయులందరికీ, సాహిత్య బంధువులందరికీ
పేరు పేరునా కృతజ్ఞతాబివాదములతో..
మీ సమయం, సహకారం సహృదయతో అందించనందుకు ప్రణమిల్లుతూ...
ఇంతటి అవధాన ప్రక్రియకు కావ్యరూపం తీసుకువచ్చేందుకు మీ సహాయసహకారాలతో నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ... పెద్సల ఆశీస్సులు, వాగ్దేవి కటాక్షాలతో... ఎప్పటికీ మన అవధానం కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షిస్తూ...
మీ కవిమిత్రుడు
గోగులపాటి కృష్ణమోహన్
10-05-2019