దృశ్య శ్రవణ అష్టావధానము - 10
స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు , వైశాఖ మాసం, శుక్ల-పంచమి
మంగళవారం, తేది 28-04-2020
అవధాని పూరణ
*ఉ.*
*రాజులనాటి కాలమును రాజిలినట్టివధానవిద్యపై*
*మోజులు తీరెనంచు ముదమొందుచు బల్కిరి యెందరెందరో*
*గాజిది గాదటంచు యుగకర్తలుగాయవధాను లందరున్*
*బూజును దుల్పుచుండ్రి ఘనపూజ్యత గాంచవధానమిప్పుడున్!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
నాపేరు సింగీతం నర్సింహారావు.
అంశం:-వర్ణన
అవధాని పూరణ
తే. గీ.
అంశం దృశ్యం
అవధాని గారికి నమస్కారములు 🙏🏻
నా పేరు కొండపాక స్వర్ణలత.
నివాసం రామాయంపేట.
ఈ రోజు నా అంశం దృశ్యం *గురువు గొప్పదనమును*
ఈ చిత్రాన్ని చూసి స్వేచ్ఛా ఛందం లో భావయుక్తమైన పద్యమును అందించగలరని కోరుచున్నాను.
ధన్యవాదములు 🙏🏻
అవధాని పూరణ
దృశ్యము పూరణ
అజ్ఙానము తొలగించియు
విజ్ఙానము కలుగజేసి విధ్యార్ధులకున్
సుజ్ఙానముకలిగించెడి
ప్రజ్ఙావంతుండుగురువు బ్రహ్మాండములో
జె. రామకృష్ణరాజు తెలుగు భాషోపాధ్యాయులు (నిజాంపేట పాఠశాల ) న్యస్తాక్షరి లో భాగంగా ...
ప్రవరుడు హిమాలయాలను చూసి ఆశ్చర్యపోయినట్లు కరోన భారతదేశాన్ని చూసి ఆశ్చర్య పోతుంది అన్న ఇతివృత్తంతో చంపకమాల వకత్తంలో నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు ని-ర-త-ము ...తో పూరించగలరు🙏
న్యస్తాక్షరి
అవధాని పూరణ
చం౹౹
నిలువగ చోటులేదునిక నిక్కము నిక్కము నేడు నాకు వీ/
రలు బహు బుద్దిమంతులిట రాజిలబోనిక నాదు పూర విం/
తలు ఇకయేమి సేతునని తానెట బోవగ చోటు లేదహో/
ములుగుచు బిక్కుబిక్కుమని పోవగ దారిని జూడజొచ్చెనే..
దృశ్య ,శ్రవణ అష్టావధానం-10
పేరు:వరుకోలు లక్ష్మయ్య
అవధాని:
బండకాడి అంజయ్య గౌడు
సంయోజకులు:
దోరవేటి గారు
నిర్వహణ:
గోగులపాటి కృష్ణ మోహన్ గారు
వరుకోలు లక్ష్మయ్య
తెలుగు భాషోపాధ్యాయులు
ZPHS గుర్రాలగొంది
జిల్లా సిద్దిపేట
చరవాణి:9704865816
తేది:28-04-2020
అంశం:
అంత్యాద్యక్షరి
పోతన భాగవతం నుండి పద్యం
ఉ:
నల్లని వాడు,పద్మ నయనంబుల వాడు, మహా శుగంబులన్
విల్లును దాల్చువాడు,గడు విప్పగు వక్షము వాడు, మేలుపై
జల్లెడి వాడు,నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులం
జల్లెడి వాడునైన, రఘు సత్తముడీవుత మా కభీష్టముల్
అవధాని పూరణ
కం.
లోకేశ్వరుడైన హరిని
ప్రాకటముగ దలచు వారి పాపములెల్లన్
చీకాకగు సత్యమిదియె
శ్రీ కమలాక్షుని స్మరించ సిరులొన గూడున్!
కృష్ణ మోహన్
గోగులపాటి వంశ్యజుడు కూరి మి సత్కవితావిధుండు స
ద్బాగవతుండు శ్రేష్టుడు విధాత కులోద్భవుడార్య మిత్రుడున్
రాగములేనివాడు రసరమ్యు డు సౌమ్యుడు కీర్తి వంతుడు
న్నీగతి దృశ్యమందునను నేర్పు గ కూర్చెవధాన సత్క్రియన్
స్వాగతమిచ్చి యందరము సన్నుతి జేతము కృష్ణమోహను న్
అభినందనలు
అష్టావధాని శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధానం పై పద్యాభినందనలు_
_*గైని శ్రీనివాస్ గౌడ్*_
_అవధాని పద్య ధారలు_
_శ్రవణానందముగ సాగె లౌక్యపు రీతై_
_చివురాకులు దొడిగెనులే_
_కవితా కాంతారమందు గమనించంగన్_
..................... _*శ్రీ*_.
తక్కువ జదివిన నేమగు ?_
_పెక్కగు పద్యముల కలిమి బిరబిర సాగన్_
_మక్కువ గల్గెను మాకది_
_పెక్కురి యభినందనమ్ము విలువను బెంచున్_
......................... _*శ్రీ*_ ✍
అవధాని అవుసుల భానుప్రకాశ్:
చదివిందారట! శబ్దశక్తి వరలెన్ సత్సాహితీ శిల్పమై,
మదులన్ మీటెను! దివ్యధార లొలుకన్ మాహాత్మ్యమౌ పద్యమౌ!
పదవిన్ జూడగ నామ మాత్రమదియే! పాండిత్యమెట్లబ్బెనో?
గద యంచున్ ఘనుడంజనార్యునకిదే కైమోడ్పులర్పించెదన్!!
చెన్నయ దోరవేటి ! పద చిత్రపు కాంతులవాటి! ధారలో
నన్నయ బోటి! లేఖినిన నవ్యత జిల్కెడు మేటి! గాత్రమా,
క్రొన్నెలదేటి! యందరికి కూర్మిని పంచెడి పేటి! యన్నయౌ
చెన్నయకేరి సాటి ధర? చెల్వగు వందనమందుకొమ్మికన్!
అవధాని ఐతగోని వెంకటేశ్వర్లు:
అంజన దీక్షాంజనమున
సంజనితానందపూర్ణ సారవధానం
బంజలి ఘటింప కవులా
యంజన సుతు కృపనుచేదు వభివందనముల్ 🙏
🙏🙏🙏🙏🙏🙏
దోరవేటి:
పూరణలో వేగమ్మును
ధారణలో నిష్ఠయును ముదావహమయ్యెన్
కారణజన్ములు మీరని
శ్రీ రమ్యాంజయ నుతింతు చిత్తము మెరయన్!
[28/04, 9:50 PM] Poet Doraveti దోరవేటి: అంజయావధాని కంజలి ఘటియించి
పృచ్ఛకాళికెల్ల ప్రేమ పంచి
అనుజు కృష్ణ మోహనుని మైత్రి దీవించి
నతులొనర్తు సుజన తతులకెల్ల!!!
వరుకోలు లక్ష్మయ్య
దృశ్య శ్రవణ అష్టావధానం-10 గోగులపాటి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో నిర్ణయించవడం జరిగింది. అవధాని బండకాడి అంజయ్య గౌడ్ గారు ఆద్యంతం ప్రాశ్నికులు అడిగిన ప్రశ్నలకు సరియైనటువంటి సమాధానాలు చెప్పారు. సంయోజకులుగా శ్రీ దోరవేటి గారు వ్యవహరించారు.ఇంకా అంజన్న గారు అనేక అవధానాలు చేసి గొప్పగా ఎదగాలని అమ్మ వారిని ప్రార్థిస్తున్నాను.
పద్యం
కం.
అవధాన్యుడు అంజయ్య యె
అవిరతముగజేయుచుండె యవధానములన్
నవతర కవులకు కవనము
చవినే చూపించసాగె సవినయముగతాన్!
మణిపూసలు వడిచర్ల సత్యం:
నిన్న దిగ్విజయంగా జరిగిన, జరిపించిన దృశ్య శ్రవణ అవధానంలో పాలుగొనడం నా అదృష్టంగా భావిస్తూ......
అందుకు కారకులైన *దోరవేటి* గారికి....
*మణిపూసలు*
తమ్ముడంటు నన్ను పిలిచి
మంచి చెడ్డ లన్ని గొలిచి
దోరవేటి అ(చె) న్నయ్య
నిలిపె నన్ను కవిగ మలిచి!!
*నిర్వాహకులకు*......
గోగుల పాటి కృష్ణ
మోహన్ సుకవి తృష్ణ
తీరినట్లు అవధానం
జరుపగదియె జ్యోత్స్న!!
*అంజన్నకూడ నన్నెప్పుడూ తమ్ముడూ అంటూ*...
సాహిత్యమె నందనం
పరిమళాల చందనం
అవధాని బండకాడి
అంజయ్యకు వందనం!!
*పృచ్చకులకు......*
వరకవులకు వందనం
పృచ్చకులకు వందనం
అవధానం గ(వి)న్నట్టి
సారసులకు వందనం!!
💐💐💐💐👏👏
మీ
*వడిచర్ల సత్యం*
అందరికీ కవితాంజలి
అవధాని బండకాడి అంజయ్య గారు
సోదర కవులెల్లరు స
మ్మోదముతో పద్యతతిని బొగడగ నాకా
హ్లాదము గలిగెను నిజముగ
యీధరణిని నాదుజన్మమే తరియించెన్
స్వస్తి
యూ ట్యూబ్ లింకు కొరకు
https://youtu.be/uX0nhaGtLrk
మీ
గోగులపాటి కృష్ణమోహన్
స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు , వైశాఖ మాసం, శుక్ల-పంచమి
మంగళవారం, తేది 28-04-2020
అవధానవర్యులు
శ్రీ బండకాడి అంజయ్యగౌడ్ గారు
సంయోజకులు:
శ్రీ దోరవేటి గారు
నిర్వహణ :
శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు
నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*
*అంశాలు - పృచ్చకులు*
౧) సమస్య - శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు
౨) దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు
౩) వర్ణన - శ్రీ సింగీతం నరసింహారావు గారు
౪) ఆశువు - శ్రీ వడిచర్ల సత్యం గారు
౫) దృశ్యము - శ్రీమతి స్వర్ణలత గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
౭) న్యస్తాక్షరి - శ్రీ రామకృష్ణ రాజు గారు
౮) అప్రస్తుతం - శ్రీ కృష్ణా గౌడ్ గారు

*దృశ్యశ్రవణ అష్టావధానం*
అవధాని ప్రార్ధనలు
సరస్వతి ప్రార్థన
శ్రీ వాణీ యలివేణీ
భావజు శతకోటిరూప ప్రార్థింతు మదిన్
రావమ్మా నను కావగ
దేవీ బ్రహ్మాణ్డ జనని తేజోమూర్తీ
గణపతి ప్రార్థన
శ్రీ గిరిజా వరనందన
భోగీంద్ర విభూష సకల బుధజన పోషా
యోగీంద్ర వరద శుభకర
రాగదె నను బ్రోవగాను రమ్య గణేశా
సమస్య:-
అవధానమ్ములు పెక్కులైన జనులత్యంతమ్ము భీతిల్లిరే
అవధాని పూరణ
చవులూరింపవు పద్యరా జము లు సత్సాంగత్యమున్ దోచదో
కవనంబెంతయు మంచిలక్షణ ములున్ కానంగరావచ్చటన్
స్తవనీయంబగు భారతార్తముల సత్కావ్యంబులన్ జెప్పరీ
యవధానమ్ములు పెక్కులైన జనులత్యంతమ్ము భీతిల్లిరే
*నిర్వాహకులు మాన్యశ్రీ గోగులపాటికృష్ణమోహన్ గారికి , సంయోజకులు మాన్యశ్రీ దోరవేటిచెన్నయ్యగారికి , అవధానవర్యులు మాన్యశ్రీ బండకాడిఅంజయ్యగౌడ్ గారికి , పృచ్ఛకవరేణ్యులందరికీ పేరుపేరునా నమస్కారములు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*👉నా పేరు కట్టరంజిత్ కుమార్*
*👉సిద్ధిపేటలో తెలుగు ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను*
**దత్తపది.... రాజు , గాజు , మోజు , బూజు పై పదాలను ఉపయోగిస్తూ "అవధానవిద్య" ను ఉత్పలమాల వృత్తములో నేను వర్ణించమని ఇవ్వగా అవధానవరేణ్యులు బండకాడిఅంజయ్యగౌడు గారు కడురమణీయముగా , అత్యంతద్భుతంగా వర్ణించారు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
అవధాని ప్రార్ధనలు
సరస్వతి ప్రార్థన
శ్రీ వాణీ యలివేణీ
భావజు శతకోటిరూప ప్రార్థింతు మదిన్
రావమ్మా నను కావగ
దేవీ బ్రహ్మాణ్డ జనని తేజోమూర్తీ
గణపతి ప్రార్థన
శ్రీ గిరిజా వరనందన
భోగీంద్ర విభూష సకల బుధజన పోషా
యోగీంద్ర వరద శుభకర
రాగదె నను బ్రోవగాను రమ్య గణేశా
సమస్య - శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు
సమస్య:-
అవధానమ్ములు పెక్కులైన జనులత్యంతమ్ము భీతిల్లిరే
అవధాని పూరణ
చవులూరింపవు పద్యరా జము లు సత్సాంగత్యమున్ దోచదో
కవనంబెంతయు మంచిలక్షణ ములున్ కానంగరావచ్చటన్
స్తవనీయంబగు భారతార్తముల సత్కావ్యంబులన్ జెప్పరీ
యవధానమ్ములు పెక్కులైన జనులత్యంతమ్ము భీతిల్లిరే
దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు
*నిర్వాహకులు మాన్యశ్రీ గోగులపాటికృష్ణమోహన్ గారికి , సంయోజకులు మాన్యశ్రీ దోరవేటిచెన్నయ్యగారికి , అవధానవర్యులు మాన్యశ్రీ బండకాడిఅంజయ్యగౌడ్ గారికి , పృచ్ఛకవరేణ్యులందరికీ పేరుపేరునా నమస్కారములు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*👉నా పేరు కట్టరంజిత్ కుమార్*
*👉సిద్ధిపేటలో తెలుగు ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను*
**దత్తపది.... రాజు , గాజు , మోజు , బూజు పై పదాలను ఉపయోగిస్తూ "అవధానవిద్య" ను ఉత్పలమాల వృత్తములో నేను వర్ణించమని ఇవ్వగా అవధానవరేణ్యులు బండకాడిఅంజయ్యగౌడు గారు కడురమణీయముగా , అత్యంతద్భుతంగా వర్ణించారు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
అవధాని పూరణ
*ఉ.*
*రాజులనాటి కాలమును రాజిలినట్టివధానవిద్యపై*
*మోజులు తీరెనంచు ముదమొందుచు బల్కిరి యెందరెందరో*
*గాజిది గాదటంచు యుగకర్తలుగాయవధాను లందరున్*
*బూజును దుల్పుచుండ్రి ఘనపూజ్యత గాంచవధానమిప్పుడున్!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
వర్ణన - శ్రీ సింగీతం నరసింహారావు గారు
వర్ణన
దృశ్యశ్రవణ ఆన్లైన్ 10వఅష్టావధానాన్ని నిర్వహిస్తున్న గోగులపాటి కృష్ణమోహన్ గారు నిర్వహిస్తూచేస్తున్న సాహితీ సేవ సంతోషదాయకమైనది.
నాపేరు సింగీతం నర్సింహారావు.
అంశం:-వర్ణన
వేటకై అడవికి వెళ్ళిన పరీక్షిన్మహారాజు దాహంతో ఒక ముని ఆశ్రమునకువెళ్ళగా అక్కడ తపస్సుచేస్తున్న ముని తనను పట్టించుకోవటంలేదని రాజు కోపంతో అక్కడే చచ్చిపడియున్న సర్పమును ఆ ముని తలపై వేసివెళ్ళిపోగా...ఆమునికుమారుడు వచ్చి అదిచూసిఆగ్రహంతో శపిస్తాడు...
ఆ శపించే సందర్భాన్ని వర్ణిస్తు స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పగలరు
అవధాని పూరణ
ఆ శపించే సందర్భాన్ని వర్ణిస్తు స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పగలరు
అవధాని పూరణ
వర్ణన:-పద్యం -కందం.
ననుగానటు గర్వముచే
మునివర్యుడటంచురాజు మూర్ఖపు బుద్ధిన్
ఫణిశవమును మెడవేయగ
మునితనయుడు శాపమొసగె ముక్కోపముతోన్!
మునివర్యుడటంచురాజు మూర్ఖపు బుద్ధిన్
ఫణిశవమును మెడవేయగ
మునితనయుడు శాపమొసగె ముక్కోపముతోన్!
ఆశువు - శ్రీ వడిచర్ల సత్యం గారు
అవధాని గారికి, నమస్కారం!
నా పేరు వడిచర్ల సత్యం
నేటి ఈ దృశ్య శ్రవణ అష్టావధానంలో నాయొక్క అంశం *ఆశుకవితకు సంబంధించిన ప్రశ్న.*
"కరోనా వలన మానవులకు అనేకమైన బాధలు, కష్టాలు, నష్టాలు సంభవించాయి కదా!?
అలాగే *మానవుల వలన కూడా కరోనాకు కలిగిన బాధలు, కష్టాలు, నష్టాలు గురించి స్వేచ్చా పద్యంలో చెప్పాలని కోరుతున్నాను.*"!?
అలాగే *మానవుల వలన కూడా కరోనాకు కలిగిన బాధలు, కష్టాలు, నష్టాలు గురించి స్వేచ్చా పద్యంలో చెప్పాలని కోరుతున్నాను.*"!?
ఆశువు
అవధాని పూరణ
తే. గీ.
బయట దిరుగరు నాయొక్క భయము చేత
ముట్టు కోరెవరైనను ముప్పటంచు
ఎటుల జీవింతు నిప్పుడు ఏమిజేతు
ననుచు భీతి జెందె కరోన మననటంచు !
అష్టావధాని
బండకాడి అంజయ్య
దృశ్యము - శ్రీమతి స్వర్ణలత గారు
అంశం దృశ్యం
అవధాని గారికి నమస్కారములు 🙏🏻
నా పేరు కొండపాక స్వర్ణలత.
నివాసం రామాయంపేట.
ఈ రోజు నా అంశం దృశ్యం *గురువు గొప్పదనమును*
ఈ చిత్రాన్ని చూసి స్వేచ్ఛా ఛందం లో భావయుక్తమైన పద్యమును అందించగలరని కోరుచున్నాను.
ధన్యవాదములు 🙏🏻
అవధాని పూరణ
దృశ్యము పూరణ
అజ్ఙానము తొలగించియు
విజ్ఙానము కలుగజేసి విధ్యార్ధులకున్
సుజ్ఙానముకలిగించెడి
ప్రజ్ఙావంతుండుగురువు బ్రహ్మాండములో
న్యస్తాక్షరి - శ్రీ రామకృష్ణ రాజు గారు
న్యస్తాక్షరి
అక్షరాలు ని-ర-త-ము ...🙏
దృశ్యశ్రవణ అష్టావధానం -10 అవధాని శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ , సంయయోజకులు శ్రీ దోరవేటి చెన్నయ్య , నిర్వహాకులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గార్ల కు నమస్సుమాంజలులు...అక్షరాలు ని-ర-త-ము ...🙏
జె. రామకృష్ణరాజు తెలుగు భాషోపాధ్యాయులు (నిజాంపేట పాఠశాల ) న్యస్తాక్షరి లో భాగంగా ...
ప్రవరుడు హిమాలయాలను చూసి ఆశ్చర్యపోయినట్లు కరోన భారతదేశాన్ని చూసి ఆశ్చర్య పోతుంది అన్న ఇతివృత్తంతో చంపకమాల వకత్తంలో నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు ని-ర-త-ము ...తో పూరించగలరు🙏
న్యస్తాక్షరి
అవధాని పూరణ
చం౹౹
నిలువగ చోటులేదునిక నిక్కము నిక్కము నేడు నాకు వీ/
రలు బహు బుద్దిమంతులిట రాజిలబోనిక నాదు పూర విం/
తలు ఇకయేమి సేతునని తానెట బోవగ చోటు లేదహో/
ములుగుచు బిక్కుబిక్కుమని పోవగ దారిని జూడజొచ్చెనే..
అంత్యాద్యక్షరి - శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
దృశ్య ,శ్రవణ అష్టావధానం-10
పేరు:వరుకోలు లక్ష్మయ్య
అవధాని:
బండకాడి అంజయ్య గౌడు
సంయోజకులు:
దోరవేటి గారు
నిర్వహణ:
గోగులపాటి కృష్ణ మోహన్ గారు
వరుకోలు లక్ష్మయ్య
తెలుగు భాషోపాధ్యాయులు
ZPHS గుర్రాలగొంది
జిల్లా సిద్దిపేట
చరవాణి:9704865816
తేది:28-04-2020
అంశం:
అంత్యాద్యక్షరి
పోతన భాగవతం నుండి పద్యం
ఉ:
నల్లని వాడు,పద్మ నయనంబుల వాడు, మహా శుగంబులన్
విల్లును దాల్చువాడు,గడు విప్పగు వక్షము వాడు, మేలుపై
జల్లెడి వాడు,నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులం
జల్లెడి వాడునైన, రఘు సత్తముడీవుత మా కభీష్టముల్
అవధాని పూరణ
కం.
లోకేశ్వరుడైన హరిని
ప్రాకటముగ దలచు వారి పాపములెల్లన్
చీకాకగు సత్యమిదియె
శ్రీ కమలాక్షుని స్మరించ సిరులొన గూడున్!
అవధాని గారి పూరణ
అవధాని ప్రశంసలు
సంచాలకులు దోరవేటిగారు
సీ...
ఎవ్వాని పదపద్యమింపుగ జవులూర
జేయు సత్కవులను క్షితితలంబు
నెవ్వాని కవనంబు నిక్షు ఖండములౌచు
రసరమ్య జిహ్వపై రాగమగును
నెవ్వాని యవధాన మెల్ల పృశ్ఛ కులను
తికమక బెట్టించు ప్రకటితముగ
యెవ్వాని కథలలో యింగి తంబును కల్గి
సుజనుగా జేయును కుజను నైన
తే.గీ
అతడె దోరవేటి యను మహా కవీంద్రు
డతడు శారదా సుతునిగ యందమైన
బుఱ్ఱకథ గేయ కావ్యముల్ పొలుపుమీర
వ్రాసి నవలలు శతకముల్ వ్యాసములను
వాసికెక్కెను " అభినవ" దాశరథిగ.
అట్టి మహనీయునకు నేను నంజలిడుదు