దృశ్య శ్రవణ అష్టావధానము - 8
స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు , వైశాఖ మాసం, శుక్ల-తదియ
ఆదివారం, తేది 26-04-2020
నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*
౧) సమస్య - శ్రీ కంది శంకరయ్య గారు
౨) దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు
౩) వర్ణన - శ్రీ గైని శ్రీనివాస్ గౌడ్ గారు
౪) ఆశువు - శ్రీమతి వేలేటి శైలజ గారు
౫) దృశ్యము - శ్రీ ఉండ్రాళ్ళ రాజేశం గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీ కళ్ళే నరసింహం గారు
౭) న్యస్తాక్షరి - శ్రీ దోరవేటి గారు
౮) అప్రస్తుతం - శ్రీ విట్టుబాబు గారు
సమస్య
పర్వత పక్షముల్ దునిమె పన్నగభూషణుడుగ్రరూపుడై
సమస్యాపూరణము
సర్వము ఖర్వమై చనెను సంస్కృతి దివ్య పురాణగాథలున్
నేర్వరు నేర్పినన్ సరియె నేర్చెదరెప్పుడు సెల్లుచూడగా
పర్వమటంచు నొక్కడును బాలకుడీవిధినుత్తరంబిడెన్
పర్వత పక్షముల్ దునిమె పన్నగభూషణుడుగ్రరూపుడై
*దత్తపది.... శూలము , బాణము , ఖడ్గము , ఢమరుకము పదాలను ఉపయోగిస్తూ అమ్మవారి వైభవమును స్వేచ్ఛాఛందస్సులో నేను వర్ణించమని ఇవ్వగా అవధానవరేణ్యులు ఐతగోనివేంకటేశ్వర్లు వారు శార్దూలవృత్తములో కడురమణీయముగా , అత్యంతద్భుతంగా వర్ణించారు!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
అవధాని పూరణ
*శా.*
*లీలన్ మూడుగుణాలఁద్రుంచెదననన్ ద్రిప్పున్ త్రిశూలమ్మునే*
*ఓలిన్ వేగముగాను బ్రోతుననగా ఓహోహొ బాణంబుచేన్*
*కేళిన్ ఆరగు శత్రులన్ దునుమగా కేల్గొంచు ఖడ్గమ్ముచే*
*నాలోకించ జయంబుకై ఢమరుకంబాదేవి తాదాల్చెడున్!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*మీ కట్టరంజిత్ కుమార్*
_*నేటి దృశ్య,శ్రవణ అష్టావధానంలో "మహాభారతంలోని ఉత్తర గోగ్రహణం ఘట్టంలో బృహన్నల అర్జునునిగా తెలిసిపోయాడో అట్లాగే విద్య , ప్రతిభా పాటవాలు అట్లాగే బయట పడ్డాయి అని వర్ణించిన అవధాని శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు గారు , పృచ్ఛకుడు శ్రీ గైని శ్రీనివాస్ గౌడ్ గారు*_
అవధాని పూరణ
_మత్తకోకిల_
_దాగదెప్పుడు దాచియుంచిన ధన్యమౌ బ్రతిభన్ గనన్_
_వేగమప్పుడు దా బృహన్నల వేషముండిన పార్థుడున్_
_ఆగకుండగ జీల్చివేయడె ? యంత నా కురు సేనలన్_
_ఈ గతిన్ బ్రతిభా రహిల్లును నెప్పుడైనను లోకమున్_
...................... _*శ్రీ*_. ✍
ఆశువు
అవధానిగారికి నమస్కారం ___నాపేరు వేలేటి శైలజ సిద్దిపేట🌸 ఈనాటి నా అంశం _🍀ఆశువు🍀,,,,,,,,,,,"నేటి అక్షయ తృతియ రోజున కరోనా ప్రభావంతో మూతబడిన బంగారపు దుకాణాల యజమానుల మానసిక స్థితిని వర్ణిస్తూ స్వేచ్చా ఛందములో చెప్పగలరు"
అవధాని పూరణ
అక్షయమైన లాభములునందక పోయెను నేడుదేవ మా
లక్షలు కోట్టు ఇప్పుడును రాణనుగోల్పడి యేడబోయెనో
శిక్ష విధించితేమిటయ శ్రీహరి రక్షణు జేయుమింక నిన్
లక్షణమున్ నుతించెదము లావుగ బాపు కరోనదేవరా
స్వస్తి శ్రీ శార్వరి సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు , వైశాఖ మాసం, శుక్ల-తదియ
ఆదివారం, తేది 26-04-2020
యువావధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సంయోజకులు:
శ్రీ డాll మాడుగుల భాస్కర శర్మ గారు
నిర్వహణ :
శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు
నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*
౧) సమస్య - శ్రీ కంది శంకరయ్య గారు
౨) దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు
౪) ఆశువు - శ్రీమతి వేలేటి శైలజ గారు
౫) దృశ్యము - శ్రీ ఉండ్రాళ్ళ రాజేశం గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీ కళ్ళే నరసింహం గారు
౭) న్యస్తాక్షరి - శ్రీ దోరవేటి గారు
౮) అప్రస్తుతం - శ్రీ విట్టుబాబు గారు
ప్రార్థన పద్యాలు
లోకాలోకములందు నిర్గుణుడ దుర్లోక్యుండవై కర్తవై
నీకార్యంబులెరుంగఁజేయుటకునై నీమూర్తి నీవేదగన్
ప్రాకామ్యంబుగ సృష్టిఁజేసికొను లీలా సచ్చిదానందమౌ
సాకారాంచిత విగ్రహుండవగు కృష్ణా! యద్వితీయా!నతుల్
కం:
శివ మాధవ రూపంబులు
ఛవి మించగనెడమకుడి భుజంబుల ద్వారన్
సువిధానము సృష్టించిన
ప్రవిమల బ్రహ్మంబ నతులు రాధా లోలా
నిర్వాహకులు శ్రీగోగులపాటి కృష్ణ మోహన్ గారిపై
తనరుచు పద్యమన్ననవధానమటన్నను యోగసాగరం
బని కొనకొంచుసాగుచునునద్భుత సాహితి జీవయానమం
దనయము సంచరించగల నార్యుడు గోగులపాటి కృష్ణ మో
హనుఁగొనియాడి నేనిచట హాయిగఁజేదు వధానమింపునన్
పృచ్ఛక ప్రశంస
1) కందిశంకరయ్య గారి పై
మానకుండగను సమస్యరోజొకటిచ్చి
శంకరాభరణము శంకలేక
పద్యకవులచేత పద్యాలు వ్రాయించు
కందిశంకరునకు వందనశతి
2) దోరవేటి గారిపై
దోరవేటి వేటినయిన తుష్టి గ్రహించి
దోరమావుల పద్యాలనూరఁజేయు
కవన ధర్మవేత్త యకవికార్యఛేత్త
యైన పూర్వావధానికినంజలింతు
3) ఈ వధానమందునింపుగా పాల్గొన్న
యితర పృచ్ఛకాలి కిత్తునతులు
సరస ప్రశ్నములను సాగగా వినువార
లూగగా వధానముండుగాక
సంచాలకప్రశంస
శాశ్వత కీర్తికన్యకను సాహితి యంచు గ్రహించి పుట్టి కా
ళేశ్వరమున్ పురస్కృతులనెన్నియొ యందు కవీశు నేడుయో
గీశ్వర లీలతోచనెడు నీయవధానపు చాలకుండగా
నీశ్వర లీలనయ్యె నతులిచ్చెద భాస్కర శర్మ గారికిన్
సమస్య - శ్రీ కంది శంకరయ్య గారు
పర్వత పక్షముల్ దునిమె పన్నగభూషణుడుగ్రరూపుడై
సమస్యాపూరణము
సర్వము ఖర్వమై చనెను సంస్కృతి దివ్య పురాణగాథలున్
నేర్వరు నేర్పినన్ సరియె నేర్చెదరెప్పుడు సెల్లుచూడగా
పర్వమటంచు నొక్కడును బాలకుడీవిధినుత్తరంబిడెన్
పర్వత పక్షముల్ దునిమె పన్నగభూషణుడుగ్రరూపుడై
దత్తపది - శ్రీ కట్టా రంజిత్ కుమార్ గారు
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
అవధాని పూరణ
*శా.*
*లీలన్ మూడుగుణాలఁద్రుంచెదననన్ ద్రిప్పున్ త్రిశూలమ్మునే*
*ఓలిన్ వేగముగాను బ్రోతుననగా ఓహోహొ బాణంబుచేన్*
*కేళిన్ ఆరగు శత్రులన్ దునుమగా కేల్గొంచు ఖడ్గమ్ముచే*
*నాలోకించ జయంబుకై ఢమరుకంబాదేవి తాదాల్చెడున్!!!*
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
*మీ కట్టరంజిత్ కుమార్*
వర్ణన - శ్రీ గైని శ్రీనివాస్ గౌడ్ గారు
_*నేటి దృశ్య,శ్రవణ అష్టావధానంలో "మహాభారతంలోని ఉత్తర గోగ్రహణం ఘట్టంలో బృహన్నల అర్జునునిగా తెలిసిపోయాడో అట్లాగే విద్య , ప్రతిభా పాటవాలు అట్లాగే బయట పడ్డాయి అని వర్ణించిన అవధాని శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు గారు , పృచ్ఛకుడు శ్రీ గైని శ్రీనివాస్ గౌడ్ గారు*_
అవధాని పూరణ
_మత్తకోకిల_
_దాగదెప్పుడు దాచియుంచిన ధన్యమౌ బ్రతిభన్ గనన్_
_వేగమప్పుడు దా బృహన్నల వేషముండిన పార్థుడున్_
_ఆగకుండగ జీల్చివేయడె ? యంత నా కురు సేనలన్_
_ఈ గతిన్ బ్రతిభా రహిల్లును నెప్పుడైనను లోకమున్_
...................... _*శ్రీ*_. ✍
ఆశువు - శ్రీమతి వేలేటి శైలజ గారు
ఆశువు
అవధానిగారికి నమస్కారం ___నాపేరు వేలేటి శైలజ సిద్దిపేట🌸 ఈనాటి నా అంశం _🍀ఆశువు🍀,,,,,,,,,,,"నేటి అక్షయ తృతియ రోజున కరోనా ప్రభావంతో మూతబడిన బంగారపు దుకాణాల యజమానుల మానసిక స్థితిని వర్ణిస్తూ స్వేచ్చా ఛందములో చెప్పగలరు"
అవధాని పూరణ
అక్షయమైన లాభములునందక పోయెను నేడుదేవ మా
లక్షలు కోట్టు ఇప్పుడును రాణనుగోల్పడి యేడబోయెనో
శిక్ష విధించితేమిటయ శ్రీహరి రక్షణు జేయుమింక నిన్
లక్షణమున్ నుతించెదము లావుగ బాపు కరోనదేవరా
దృశ్యము - శ్రీ ఉండ్రాళ్ళ రాజేశం గారు
పేరు ఉండ్రాళ్ళ రాజేశం,
సిద్దిపేట
అంశం : దృశ్యము
దృశ్యము
వేములవాడ దేవస్థానం ముందర రెండు కోడేలు భక్తుల కోసం ఎదురు చూస్తున్న దృశ్యం పై కంద పద్యములో తెలియజేయగలరు
అవధాని పూరణ
మేమేమి పాపమెపుడో
స్వామీ!మరిచేసినామొ చక్కకమమ్మున్
నీమముతో నీకీయగ
వేముల వాడను గుడియిక వే మూసిరొకో
అంత్యాద్యక్షరి - శ్రీ కళ్ళే నరసింహం గారు
*"దృశ్యశ్రవణ అష్టావధానం"* స్రష్ట,నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారికీ, సంయోజకులు శ్రీ మాడుగుల భాస్కరశర్మ గారికీ, అవధానవర్యులు శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు గారికీ, పృచ్ఛక మహోదయులకూ నా ప్రణామములు.
నా పేరు *కళ్ళే నరసింహం*, నేను అనంతపురములో ఆంగ్లోపన్యాసకునిగా పనిచేస్తున్నాను.
ఈనాటి దృశ్యశ్రవణ అష్టావధానంలో నా అంశం : అంత్యాద్యక్షరి.
అవధరించండి.
అవధరించండి.
*మ్రొక్కెద నరుణగిరీశా*
*మ్రొక్కెదనయ వేగగావ మునిజనవంద్యా!*
*మ్రొక్కెద జ్ఞానము నీయగ*
*మ్రొక్కెదనయ మోక్షమిడగ ముక్కంటీశా!*
*మ్రొక్కెదనయ వేగగావ మునిజనవంద్యా!*
*మ్రొక్కెద జ్ఞానము నీయగ*
*మ్రొక్కెదనయ మోక్షమిడగ ముక్కంటీశా!*
ధన్యవాదములు.
🙏🌹🙏
🙏🌹🙏
అవధానివర్యులు అంత్యాద్యక్షరి పై చేసిన శ్రీమహావిష్ణు ప్రార్థన—
అవధాని పూరణ
శాంతాకారుడుశౌరిసర్వమయుడైసర్వేశుడైలోకముల్
స్వాంతమ్మందునయోగనిద్రముననిత్యాలోకముం జేయుచున్
చెంతన్ జేరుచుసిద్ధభక్త వరులన్ శీఘ్రంబు రక్షించు నే
నెం తేనాతనిసన్నుతింతునిలలోతృష్ణల్ ఫలింపంగనే!
స్వాంతమ్మందునయోగనిద్రముననిత్యాలోకముం జేయుచున్
చెంతన్ జేరుచుసిద్ధభక్త వరులన్ శీఘ్రంబు రక్షించు నే
నెం తేనాతనిసన్నుతింతునిలలోతృష్ణల్ ఫలింపంగనే!
ధన్యవాదములు.
🙏🌹🙏
🙏🌹🙏
న్యస్తాక్షరి - శ్రీ దోరవేటి గారు
దోరవేటి- హైదరాబాద్... న్యస్తాక్షరి
అ-వ- ధా- నం- ఈ అక్షరాలను ఆద్యక్షరాలుగా ఉపయోగిస్తూ...
రైతు జీవితం నేపథ్యం గా ఇష్టమైన ఛందంలో పద్యం చెప్పండి...
న్యస్తాక్షరి.....
అవధాని పూరణ
అత్తల్ కోడలు నెల్లవారు త్వరగా నా క్షేత్రమున్ జేరుచున్
వత్తాసై సహకారమీయ ప్రకృతిన్ వందించి పూజించి బా
ధాత్తంబైనను నన్నమీయ ప్రజకై తామున్ పనిన్ జేయరే
నత్తల్ వోలెను జీవయాన మకటా! నష్టంబుగా సాగినన్
అప్రస్తుతం - శ్రీ విట్టుబాబు గారు
నా అప్రస్తుత ప్రశ్నలకు అవధాని గారి సమాధానాలు:
*అప్రస్తుతము ప్రశ్న 1*
అవధాని గారూ.. అవధానము అంటే అక్షరములతో ఆడే ఆట కదా! మరి క్షరములతో కూడా ఆడే ఆట ఏమైనా ఉందంటారా.. ఉంటే అది ఏమై ఉంటుంది.?
*అవధాని గారి సమాధానం:*
ఆర్యా! అక్షరములతో ఆడే క్రీడ అవధానమయితే, క్షరములతో ఆడే క్రీడ బ్రతుకు. ఎందుకంటే ఈ జీవితంలో ఏ సుఖము గానీ, వయసే గానీ రోజురోజుకూ క్షీణించిపోతున్నది. క్షరమైపోతున్నది.
*అప్రస్తుతం ప్రశ్న 2*
అవధానిగారూ! పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఇప్పుడు లేవు. ఒకవేళ ఇప్పుడు కూడా పర్వతాలకు రెక్కలుంటే ఏమయ్యుండేది?
*అవధానిగారి సమాధానము*
ఆర్యా! ఇప్పుడూ పర్వతాలకి రెక్కలున్నాయండి.. ఇక్కడ పర్వతాలంటే భౌతికమైన కోర్కెలు. అవి రెక్కలు దాల్చి ప్రపంచమంతా సంచరిస్తూండడం వలన జీవి జననమరణచక్రంలో కొట్టుకుపోతూంటే... ఇంద్రరూపంలో ఉన్న పరమాత్ముడు ఆ రెక్కలను నరికివేస్తాడని మనం అర్థం చేసికోవాలి. ఎందుకుంటే వేదాలలో ఇంద్రుడు కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పారు. మనం మోహమనే పర్వతానికి ఉన్న రెక్కలను తప్పకుండా నరికేసుకోవాలి.
*అప్రస్తుతము ప్రశ్న 3*
అవధానిగారూ.. శూలము, ఖడ్గము, బాణము లాంటి పదాలతో పూరణము చేస్తున్నారు కదా! మీకు నిజ జీవితంలో ఇలాంటి ఆయుధాల ప్రయోగంలో అనుభవం ఉన్నదా?
*అవధాని గారి సమాధానం:*
ఆర్యా! నేను వాటిని తాత్వికమైన భావనలతో పూరించాను చూడండి. శూలంతో అమ్మవారు త్రిగుణాలను ఛేదిస్తుందని, బాణం వేగంగా పోతుంది కాబట్టి అమ్మవారు వేగంగా రక్షిస్తుందని, ఖడ్గంతో మనలోపల ఉన్న షడ్వర్గాలను ఛేదిస్తుందనీ, ఢమరుకం జయానికని... మనజీవితమనే అవధానంలో, బాణం వలె వేగమైన ఆశువు, శూలం వలె పద్యం చెప్పునపుడు త్రిగుణాలకు అతీతంగా చెప్పడం, ఖడ్గం వలె ధారణ తప్పించే అంశాలను ఖండించడం, ఢమరుకం వలె విజయాలను అందుకోవడం చేస్తాను.
ధన్యవాదాలు
🙏🏻🙏🏻
అభినందనలు
_అవధాని గారిపై ప్రశంసా పద్యాలు_
_*గైని శ్రీనివాస్ గౌడ్*_
_*సిద్ధిపేట*_
_*సిద్ధిపేట*_
_మత్తకోకిల పద్యమందున మత్తగొల్పెడి భావమై_
_యెత్తుకున్నది స్వేచ్ఛ ఛందము నిమ్ము గూర్చెను వర్ణనై_
_మెత్తనైనది వర్ణ శబ్దము మెండు హర్హము గూర్చెనే_
_చిత్తమందున నిల్చి పోవునె స్ఫీతమైనటు వర్ణముల్_
_యెత్తుకున్నది స్వేచ్ఛ ఛందము నిమ్ము గూర్చెను వర్ణనై_
_మెత్తనైనది వర్ణ శబ్దము మెండు హర్హము గూర్చెనే_
_చిత్తమందున నిల్చి పోవునె స్ఫీతమైనటు వర్ణముల్_
_వర్ణన జేయంగను నా_
_కర్ణమ్ముల నాలకించ గైసేసిన నా_
_వర్ణమ్ముల శబ్దము సం_
_పూర్ణంబై పద్యమెల్ల మోదము గూర్చెన్_
....................... _*శ్రీ*_. ✍
_కర్ణమ్ముల నాలకించ గైసేసిన నా_
_వర్ణమ్ముల శబ్దము సం_
_పూర్ణంబై పద్యమెల్ల మోదము గూర్చెన్_
....................... _*శ్రీ*_. ✍
చక్కని అష్టావధాన కార్యక్రమం మొదటిసారి నేను పాల్గోనడానికి అవకాశం కల్పించిన గోగులపాటి కృషమోహన్ గారికి, అవధాని వెంకటేశ్వర్లు గారికి సంయోజకులు పృచ్చకులకు ధన్యవాదాలు .. భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆశీస్తూ ....🙏🙏🙏
ఉండ్రాళ్ళ రాజేశం, సిద్దిపేట
ఉండ్రాళ్ళ రాజేశం, సిద్దిపేట
తెలుగు తేనె రసము తీపిదనమ్ముతో
ఐతగోని పద్యమవతరించె
ధారయున్ ధారణ తాదాత్మ్యతను చెంది
వెలువడెనా నోట విస్తృతముగ
పృచ్ఛకులందరునిచ్ఛాను సారము
యడిగిన ప్రశ్నల నద్భుతముగ
వివరించె గొప్పగా విధివిధానములోన
పద్యకేళీరత్న ప్రాభవముగ
ధన్యులందరు,అవధాన తత్వమందు
కృష్ణమోహన పథదర్శ
క్రీడ యిదియె
సరస సాహిత్య సాఫల్య సంబరమ్ము
ధన్యవాదములందరు
మాన్యులకును.
.....డా.మాడుగుల భాస్కర శర్మ
అవధాని మనోగతం
ఆవృత్తులనుగల్గునవధానమదిగల్గు
బైటి సభలయందు బాగుగాను
ఇచ్చటనొకమారె యిచ్చిన యంశంబు
పద్యంబు సెప్పిన బాధలేక
చివరగనన్నిటిన్ శీఘ్రధారణచేసి
పూర్తి చేయగ మదిపొంగెనేడు
నమ్మకమ్మదిగల్గెనిమ్ముగా నేనింక
శత వధానమయిన సల్పెదనని
తే.గీ
ఇచట పృచ్ఛకవర్యులు ఇంపుతోడ
ప్రశ్నలడిగిన మీకునే లాలితముగ
వందనందన చందనాలందఁజేదు
ముదము గొనుడింక మీమది పొంగగాను
ఇట్టి అవధానం యూట్యూబ్ లో వీక్షించుటకై...
https://youtu.be/VkGmn95-r50
స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్

No comments:
Post a Comment