Wednesday, April 22, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 5

దృశ్య శ్రవణ అష్టావధానము - 5
(సంస్కృతావధానము)

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంతృతువు,
చైత్ర మాసం, అమావాస్య,
బుధవారం, తేది 22-04-2020

అవధాని : 

బ్రహ్మశ్రీ డా|| అయాచితం నటేశ్వర శర్మ గారు


సంయోజకులు: 

బ్రహ్మశ్రీ పార్వెళ్ళ శ్రీధర శర్మ గారు


నిర్వహణ : 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

సంస్కృతావధానంలో
*అంశాలు - పృచ్చకులు*

1.నిషేధాక్షరీ - శ్రీ మాడుగుల భాస్కరశర్మ గారు
2. సమస్యా - బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకరశర్మ గారు
3.దత్తపదీ - బ్రహ్మశ్రీ ముదిగొండ అమరనాథశర్మ గారు
4.వర్ణనమ్ -  శ్రీ ముత్యంపేట మల్లిఖార్జున శర్మ గారు
5.అనువాదపద్యమ్ - శ్రీ ముదిగొండ నాగరాజు శర్మ గారు
6.దృశ్యమ్ - శ్రీ మల్లావజ్జుల చంద్రశేఖర్ శర్మ గారు
7.ఆశుకవితా - బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు
8.అంత్యాద్యక్షరా - శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు

అవధాని ప్రార్ధన
ప్రార్థనాశ్లోకా: !
🍁🍁🍁🍁
సిద్ధిబుద్ధిప్రదం దేవం
సంతతాభీష్టదాయకమ్
రామారెడ్డిపురాధీశం
వందే విఘ్నవినాశకమ్ !

బ్రాహ్మీస్వాంతసరోవరప్రవిలసత్ శ్రీరాజహంసో విధి:
లక్ష్మీభాసితదుగ్ధసాగరశయ: శ్రీచక్రధారీ హరి:
గౌరీమానసజాహ్నవీవిహరణశ్చంద్రప్రభాశేఖర:
పాయాసుర్మహితావధానకలనా: సాహిత్యలోకం సదా !

ఇదం కవిభ్య: సర్వేభ్యో
నమోవాకం ప్రశాస్మహే
దృశ్యశ్రవణషద్గోష్ఠీ
పృచ్ఛకేభ్య: ప్రమోదిత: !

దృశ్యశ్రవణసాహిత్య
సంధానానందనందన:
జీయాత్ సేవామనోభావ:
యశస్వీ కృష్ణమోహన: !

భారతీ భాతు మద్వాచి
భారతీ భాతు మే హృది
భారతీ భాతు మద్గేహే
భారతీం ప్రణమామ్యహమ్ !

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మమాగమనం , ప్రార్థనశ్లోకపఠనం చ పర్యాప్తమ్.ఇదానీమహమభ్యర్థయే పృచ్ఛకాన్ స్వీయప్రశ్నాన్ దాతుమ్ !


సభాయైనమః
అవధానిగారికి నమస్కారములు
నా పేరు డా.మాడుగుల భాస్కర శర్మ
అష్టావధానములో
నేనిచ్చే అంశం
నిషేధాక్షరీ
..................
మేషాది రాశుల వర్ణన
మ,వ,క,స లు నిషేధం


అవధాని పూరణ: నిషేధాక్షరీ:
🍁🍁🍁
అజభద్రయుగాఅప్చర
హరియోషాతౌలనాళిచాపశిశుఘ్నమ్
ఘటఝషభాగతరాశి:
భరణీయం భాతి భాగణే గణనీయే !


నమస్సభాయై మమనామ ముత్యంపేట గౌరీశంకర శర్మ అంశం:- సమస్య  *గౌరీనేచ్ఛతి శంకరస్య వదనం ద్రష్టుం శరద్యేకదా *

అవధాని పూరణ: సమస్యా:
🍁🍁🍁
ఈశం ప్రాప్తుమగణ్యఘోరతపసా సంతాపితే భూధరే
ఈశం నిందితుమాగతం వటుమహో దృష్ట్వా హిమాద్రేస్సుతా
వైముఖ్యం ప్రకటీకృతా శివపరధ్యానా తదజ్ఞానత:
గౌరీ నేచ్ఛతి శంకరస్య వదనం ద్రష్టుం శరద్యేకదా !


ఆయాచితం కులోత్పన్న 
రస ధారా ధరాన్విత అవధాన విధానేస్మి న్    స్వీకురుష్వఅభివందనమ్
డా ముదిగొండ

నమస్సభాయై మమనామ ముదిగొండ అమరనాథశర్మ
అంశః దత్తపది
వ్యాస వాల్మీకి భాస కాళిదాస అనేన పద చతుష్టయేన సంస్కృత  భాషా  ప్రాశస్త్యం

అవధాని పూరణ: దత్తపదీ:
🍁🍁🍁
వాల్మీకివచనానందా వ్యాసభారతరాజితా
భాసనాటకసంభాసా
కాళిదాసకథాత్మికా
భాసతే విశ్వకల్యాణీ
భారతీ సంస్కృతాభిధా
దేవవాణీతి సంఖ్యాతా
భారతే ధర్మగీరతే !



నమఃసభాయై🙏🏻
అవధాని మహోదయానాం నమాంసి భూయాంసి
మమనామ: యం మల్లికార్జున శర్మ
అద్య వర్ణనాంశే
"దక్షిణామూర్తి స్వరూపం" స్వేచ్చా ఛందే వర్ణయంతు

అవధాని పూరణ:: వర్ణనమ్ :
🍁🍁🍁
దర్పణే దర్శితం యేన
సర్వం విశ్వం చరాచరమ్
తం వందే దక్షిణామూర్తిం
మేధాజ్ఞానవివర్ధకమ్ !



పద్య పూరణలు: ముదిగొండ నాగరాజ శర్మ
అంశః పద్య అనువాదం

చడువనివాడు అజ్ఞునడగు
చదివిన సదశద్వివేక చతురత గలుగున్
చడువగ వలయును జనులకు
చదివించెద నార్యులొడ్డ చదువుము తండ్రీ


అవధాని పూరణ: అనువాదపద్యమ్ :
🍁🍁🍁🍁🍁
అపఠన్ ప్రభవతి మూఢ:
పఠనేన సదసతోర్వికాసం లభతే
పఠనమవశ్యం జగతే:
పాఠయితుం నేష్యతే సుపుత్ర! పఠ భృశమ్ !



అవధాని మహోదయానాం నమాంసి భూయాంసి
మమనామ: మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ
సర్వేషాం అహం అభివాదయామి
మయా దత్త అంశః
దృశ్యం

ప్రసిధ్ధ హరిద్వార గంగాక్షేత్రే
తీర్థయాత్రీనాం సందర్శన రహితకారణేన
నిర్మలవాతావరణం అస్తి.
ఏతద్ దృశ్యం
వర్ణయంతు ఇతి ప్రార్థయామి
సంస్కృత భాషేన భావవ్యక్తీకరణ జ్ఞానం నాస్తి
తత్కారణేన మాతృభాషాయం ప్రసంగిత చలనచిత్ర ం ఆహం ప్రధర్శయామి
క్షమ్యతాం


అవధాని పూరణ: దృశ్యమ్:
🍁🍁🍁
భాగీరథీ నిర్మలవాహినీయం
కాలుష్యతాం ప్రాప్తవతీహ పూర్వమ్
యాత్రాజనాభావతయా హి సాద్య
స్వచ్ఛప్రవాహా లసతే నితాంతమ్ !



ఆశువు అంశానికి ప్రశ్న

ఘోరకరోనా విలయం కన్నా మనిషిలోని క్రౌర్యమే హేయమని ప్రకటిస్తూ నిన్న అతి క్రూరంగా , కిరాతకంగా సాధువులను కొట్టి చంపిన దుర్మార్గాన్ని నిరసిస్తూ ఒక శ్లోకం చెప్పండి.
       .....మరుమాముల దత్తాత్రేయ శర్మ

అవధాని పూరణ: ఆశుకవితా:
🍁🍁🍁🍁
భయం నాస్తి కరోనాయా:
మనుష్యాత్ హీనవర్తనాత్
భయమద్య జనాన్ హంతి
మానవీయపథచ్యుతమ్
పాల్ఘార్ స్థానీయదుష్కృత్య
లజ్జితం హ్యద్య భారతమ్
దుష్టశిక్షా ప్రకర్తవ్యా
శిష్టరక్షణకాంక్షిభి: !



అంత్యాద్యక్షరి
అమరవాది రాజశేఖర శర్మ

అపి స్వర్ణమయీ లంకా- న మే రోచతి లక్ష్మణా,
జనని జన్మభూమిస్చ స్వర్గాదపి గరీయసి ".

అవధాని పూరణ:: అంత్యాద్యక్షరా :
🍁🍁🍁🍁🍁
సీతాయాశ్చరితం సర్వం
రామగాథాప్రపంచితమ్
తస్మాదేవ హి సాహిత్యే
రామగాథా గరీయసీ !

అభినందనలు


[22/04, 6:02 PM] Poet Mallavajjula Chandra Shekar: సంస్కృతాంధ్రములందు సత్పండితులుమీరు
సవ్యసాచిగజూపి సత్పథమును

అవధానమునుబెంచు నద్భుతవిషయాలు
నందజేతురుమాకు సుందరముగ

సాధుమానసమున బాధనొందించక
స్పందనలిత్తురా నందముగను

వచనకవితలను పద్యరాజములను
ఘనముగాగురిపించు కలముమీది

శ్రీ నటేశ్వరశర్మ గసృష్టిజేయ
రెన్నియోపద్యకవితలుమన్ననొంది
కలమునటరాజుగానిల్చికావ్యమందు
చిందులేయగా రచనలు సుందరమ్ము


[22/04, 6:17 PM] Poet Madugula Narayana Murty Buf: అద్భుతపూరణజేసిన
సద్బుధుడునటేశశర్మసంస్కృతమందున్
సద్భావనలింపార;ర
విద్భాసురకీర్తినింపె విద్వణ్మణియై


[22/04, 6:27 PM] Poet Madugula Bhasker Sharma Buf: నా స్పందన -వందనం
..............................
పురుషసద్వాణి సద్రూపం
సాహిత్యాంబుధి శోధితం
సంస్కృతాంధ్ర మహావక్తారం
నటేశ్వర గురోర్నమః
అష్టావధాన సంపన్నం
అద్భుతానందదాయకం
సాహితీ కదనోత్సాహం
సతతం దర్శితం శుభమ్.
...డా.మాడుగుల భాస్కర శర్మ

యూట్యూబ్ లింకు కొరకు
https://youtu.be/WcVwX6Lf7fY

మీ
భవధీయుడు
గోగులపాటి కృష్ణమోహన్

స్వస్తి

Tuesday, April 21, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 4

దృశ్య శ్రవణ అష్టావధానము - 4
(సంస్కృతావధానము)

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంతృతువు,
చైత్ర మాసం, కృష్ణ-చతుర్దశి,
మంగళవారం, తేది 21-04-2020

అవధానవర్యులు

బ్రహ్మశ్రీ డా|| ముదిగొండ అమరనాథశర్మ గారు

సంయోజకులు

అవధానతిలక
బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకరశర్మ గారు

నిర్వహణ

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

*అంశాలు*
సమస్య : శ్రీ ముదిగొండ నాగరాజు శర్మ గారు
దత్తపది : శ్రీ ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు
వర్ణన : బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ
ఆశువు : శ్రీ పార్వెళ్ళ శ్రీధర శర్మ గారు
పద్యానువాదం  : శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు
నిషిద్దాక్షరి : శ్రీ నిర్మల సిద్దిరామ శర్మ
అంత్యాద్యక్షరీ : శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారు
దృశ్యం : శ్రీమతి లక్ష్మీమదన్ గారు

సంయోజకులు
అద్య సాయం సప్తవాదన సమయే అవధాన కార్యక్రమః ప్రారభ్యతే । స్వీయఅంశైః సర్వే ప్రాశ్నికాః సన్నద్ధాః భవంత్వితి ప్రార్థయే  !

స్వాగతం
ముదిగొండసుధాంభోధి
కవిచంద్రో విరాజతామ్
వధాన్యమరనాథాఖ్య:
కవనోత్సవతత్పర: !
బ్రహ్మశ్రీ డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మా

సంయోజకులు
ముదిగొండ వంశగుణధీ !
సదమలయవధానకవనసాహిత్యనిధీ!
పదములు వేయగ రమ్మా !
హృదయావిష్కరణజేయనుత్సాహముతో !


అవధాని ప్రార్ధన


సమస్య

శ్రీ ముదిగొండ నాగరాజ శర్మ

మమ సమస్యా శ్లోకపాధం
కాళిదాస కవితా దరిద్రతా



పూరణ
యస్యనాస్తి ఖలు శబ్ద చింతనా
కావ్య భావ్య రసరమ్య భూషణా
తస్య జీవన విధౌచ దృశ్యతే
కాళిదాస కవితా దరిద్రతా

ఆశు అంశః

శ్రీ పార్వెళ్ళ శ్రీధర శర్మ


ఆశు అంశః
దృశ్య,శ్రవణ అష్టావధాన  సద్గోష్ఠీం  అధికృత్య వర్ణయన్తు ఇతి ప్రార్ధయామి

పూరణ
దృశ్యే శ్రావ్యే నవరసయుతే తేవ్యదష్టావధానే
రమ్యే భవ్యే సరసిలసితే
ప్రాశ్నికజ్ఞానగమ్యే
నవ్యే సవ్యే సురుచిరపదైః కృష్ణమోహన్ ప్రదీప్తౌ
దేయాన్నిత్యం పరమ సుఖదా శారదా మంగళంవా


దత్తపది

శ్రీ మల్లికార్జున శర్మ

అవధాని మహోదయస్య నమాంసి భుయాంసి 🙏🏻 
మమనామ యం.మల్లికార్జున శర్మ
మమ అంశం:దత్తపది
ఆశా
పాశం
నాశః
కాషాయ
ఏతాని పదాని ఉపయుజ్య "కరోన" నిర్మూలనాయ పరమేశ్వరస్య ప్రార్థనాం కుర్వంతు👌👏ధన్యవాదాః

  ***********************
పూరణ
నాశంకరోనాం కురు దేవదేవ
ఆశాంప్రజాభ్యః సుఖజీవనాయా
పాశం ప్రపంచే విధివచ్ఛ ఛిత్వా
కాషాయ రాజ్యస్య శుభాని దత్వా


దృశ్యం

శ్రీమతి లక్ష్మీమదన్

అవధాని గారికి  ప్రణామములు
పేరు : లక్ష్మీ మదన్, హైదరాబాదు
అంశము : దృశ్యము

అందరికీ ఎంతో కొంత దానం చేయాలని ఉంటుంది....దానం చేసినది గోప్యంగా ఉంచాలా! లేక నలుగురు స్ఫూర్తి పొందగలరని చాటాలా! దీనిని స్వేచ్చా చందం లో మీ అభిప్రాయం తెలపండి .

పూరణ
ఏకత్రదానేనచ త్యాగ వృద్ధిః
అన్యత్ర దానేనచదివ్య స్ఫూర్తిః
భుజ్యాచ స్ఫూర్త్యా భువి మానవాశ్చ
లోకే ప్రసిద్ధిన్ ఖలు ప్రాప్నువంతి


అంత్యాద్యక్షరీ 

శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారు

నమస్సభాయై
మమ నామ డా.మాడుగుల భాస్కర శర్మ
కాళేశ్వర గ్రామస్య నివాసీ అస్మి.
అవధాన ప్రాశ్నికాంశః
అంత్యాద్యక్షరీ
........................
యాకుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యావీణా వరదండ మండితకరా
యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః
దేవైస్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ
భగవతీ నిశ్శేష జాడ్యాపహా !

పూరణ..
హవ్యం భవ్యం ప్రబలగదితం చోద్భవేశంసురేశం
సవ్యం సౌఖ్యం సముచితపదం చారుచంద్రావతంసం
కవ్యం కావ్యం కరుణ గుణదం కావ్యగానప్రీయంతం
శ్రీవిశ్వేశం పరమ సుఖదం భావయేద్భక్తి గమ్యం



నిషిద్ధాక్షరీ
శ్రీ నిర్మల సిద్ధిరామ శర్మ

నిషిద్ధాక్షరీ
శ్రీ,య,మా,భ
..................
శ్రీ నిర్మల సిద్ధిరామ శర్మ
కరోనా రోగ సంక్రమణ భయాత్ సర్వే పరివార సభ్యాః స్వస్వ గృహేషు
నివసన్ మాతా పితృ గురు దేవతా భక్తియుతాః
సదాచార రతాః‌,
రోగస్య సంపూర్ణ నాశానంతరం అభి ఏవమేవ భవేయు ఇతి
ప్రజా సందేశాత్మకం శ్లోకం స్వేచ్ఛా వృత్తే శ్రావయతు

పూరణ
విషజ్వర సమాప్తేపి
స్నేహపూర్వక చింతనా
రాజతాత్  రాగదాసాచ
రాజేశ్వర కృపా వశాత్
.....

పద్యానువాదం

శ్రీ అమరవాది రాజశేఖర శర్మ

శ్రీ అమరవాది రాజశేఖర శర్మ
పద్యానువాదం
.........................
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ !

పూరణ
 భూమిర్మమేతి విషయే
రసా హసతి సర్వదా
తథైవ దాన హీనేచ
కదనే కామ సంపదౌ

వర్ణన

శ్రీమరుమామల దత్తాత్రేయ శర్మ

వర్ణన..మరుమాముల దత్తాత్రేయ శర్మ

కరోనా జనులందరికీ భయంకరోనా గా మారినప్పటికీ
నదీనదాలు స్వచ్ఛమైనాయి. పశుపక్ష్యాదులు స్వేచ్ఛను పొందాయి.
ఈ అంశాన్ని మత్తేభవృత్తంలో వర్ణించండి.
..............
పూరణ
..............
రమణీయామృత వృక్షశాఖ విభవే
స్వేచ్ఛావృతాః పక్షిణః
కమనీయామృత ధారయాచ సలిలం
సద్యోరసాప్లావితం
రమణీయామృత పద్య గద్య మహిమా
రారాజతాత్ సర్వదా
స్తవనీయామృత దుష్కరోన సమయే
తృప్తాశ్చ ధన్యాః ప్రజాః

ఆసత్యలోకదాశేషు
దాలోకలోకపర్వతాః
యేసంతిబ్రాహ్మణాదేవా
తేభ్యోనిత్యం నమోనమః

స్మార్టు ఫోనులోడౌన్లోడసాధ్యమయ్యె
భాష వేషము మాయమై బాధకలిగె
పండితోత్తములందరునిండుకొనగ
దృశ్య రూపమేచూడగా దివ్యమిచట
శ్రీ మల్లావజ్జుల చంద్రశేఖర్ శర్మ 

మరుమాముల దత్తాత్రేయ శర్మ:
చూచి వినుచు మాటాడెడు చోద్య విద్య
దృశ్య సుశ్రావ్య మవధాన ధిషణ యందు
సంస్కృతాంధ్రభాషా విభూషలుగ కవన
మధురిమల్ పంచుచు కరోన మాడిపోవ
ప్రతిభ ప్రకటించు ముదిగొండ వంశ మణిని
పండితామరనాథు వాక్పటిమ మెత్తు!

దత్తపది పదాల పూరణ బావుంది,చక్కగా పదాలను అమర్చి  చక్కటి శ్లోకం అందించిన అవధాని డాక్టర్ అమరనాథ శర్మ గారికి,ఇంత మంచి కార్యక్రమాన్ని రసవత్తరంగా నిర్వహించిన కృష్ణమోహన్ అన్నయ్య గారికి ప్రత్యేక అభినందనలు,💐నమస్కారములు👏🙏🏻🙏🏻🙏🏻

ముదిగొండ నాగరాజు

Sreeyamaranaadhaakhya మహావధానినం సుష్లోక సుగ్నాన విధానవంతం
గీర్వా న saahityavikaasavantam
తం noumipragnaaanapraceepayantam


సంస్కృత అష్టావధానము బ్ర.శ్రీ .డా.ముదిగొండ అమరనాథ శర్మ గారు
అత్యంత అద్భుతముగా చేశారు.
ఎందరో మహానుభావులు ఇందులో పృచ్ఛకులుగా ఉన్నారు. బ్ర.శ్రీ. ముత్యంపేట గౌరీశంకర శర్మగారు ఎంతో గొప్పగా సంయోజకత్వం జరిపారు..శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ శర్మగారు
నిర్వహణ‌,దర్శకత్వం సర్వం తానై కవులందరినీ ఏకత్రాటిపై నడిపి సర్వోత్కృష్టం గా సంస్కృతావధానాన్ని
సాఫల్యం చేశారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా
హృదయ పూర్వకంగా
కృషి చేసీన వారందరికీ అభినందనలు.ధన్యవాదములు.
మాడుగుల భాస్కరశర్మ
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽



యూట్యూబ్లింలిం కోసం
https://youtu.be/snWTqDyoC1o

మీ
గోగులపాటి కృష్ణమోహన్
నిర్వాహకులు

స్వస్తి

Monday, April 20, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 3

దృశ్య శ్రవణ అష్టావధానము - 3*

స్వస్తిశ్రీ శార్వరీ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర బహుళ ద్వాదశి, ఆదివారము.
తేది: 19-04-2020, ఆది వారము

అవధాని


బ్రహ్మశ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు


సంయోజకులు

శ్రీ గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు


నిర్వహణ 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

*పృచ్ఛకులు*
సమస్య : *శ్రీ మాడుగుల భాస్కర్ శర్మ గారు*
దత్తపది : *బ్రహ్మశ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు*
వర్ణన : *శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు*
ఆశువు : *శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు*
అప్రస్తుతం : *శ్రీ మల్లావజ్జుల చంద్రశేఖర్ శర్మ గారు*
అంత్యాద్యక్షరీ : *బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు*
దృశ్యం : *డా|| రామక కృష్ణమూర్తి గారు*
న్యస్తాక్షరి : *శ్రీమతి పద్మ చిగురాల గారు*

అవధాని ప్రార్థనా శ్లోకాలు
శ్రీ గణనాయకస్తుతితో
వాగనుసంధానరాణివాణినిగొలువన్
స్వాగతమందునుపెద్దలు
రాగముజూపించిగాచ రయ్యలు కృపతో.

2.తల్లినిదండ్రినివేడెద
నుల్లములోనున్నయట్టి యొజ్జల నెల్లన్
కల్లాకపటములెరుగని
చల్లని హృదయాల గొలుతు సాకగ నన్నున్

3.దృశ్య శ్రవణాల మాధ్యమ దీప్తి గరిమ
వెలుగును నష్టావధానమ్ము తెలుగు జిలుగు
వాణి యలివేణి వాహక శ్రేణి లోన
వందనమ్ములు పృచ్ఛక వర్యులార!!

దృశ్య శ్రవ్య అష్టావధానం-3

నాపేరు డా.మాడుగుల భాస్కర శర్మ, కాళేశ్వరం
అంశము : సమస్య
.............................
కన్యకు యేడుకన్నులను గాంచి వరుండట మెచ్చె వెంటనే.


సమస్యాపూరణము
అవధాని గారి పూరణ

మాన్యుల సృష్టి హార్మొనిగ మాధురిగీతల నిండు వేడుకై
ధన్యము జేయు జీవితము ధారగ పాటలు సంతసమ్మునై
అన్యుల శ్రావ్యగానముల నంకిత దృష్టిన రాగమాలికల్
కన్యకు యేడుకన్నులను గాంచి వరుండట మెచ్చె వెంటనే.





డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.

అవధానిగారికి

 పై దృశ్యాన్ని చూసి మంచి సందేశాత్మక పద్యాన్ని,మీ స్వేచ్ఛావృత్తంలో చెప్పగలరని మనవి.

అవధాని గారి పూరణ
దృశ్యం:
వైద్యులు ప్రజలను గాచగ
వేద్యులు క్రైస్తవులు హిందు విజ్ఞులు కలువన్
బాధ్యులు ముస్లిలొకటై
ఆద్యంతము గౌరవించిరాదర మొప్పన్.



నాపేరు:- ముత్యంపేట గౌరీశంకరశర్మ
అంశం:- అంత్యాద్యక్షరీ
పద్యం:- సుధలన్ జిందెడి చందమామతలపై శోభిల్ల విశ్వంభరన్
మధురానంతరసప్రపూరణజగతిన్ మాన్యంబుగాజేసి స
ద్బుధతన్ లోకులకీయగల్గుఘనుడౌ పూజ్యుండు వెమ్లాడ పె
న్నిధియైవెల్గెడు రాజలింగని పదంబేగొల్తు వాక్సిద్ధికై ....

అవధాని గారి పూరణ
అంత్యాదక్షరి:-
కైమోడ్చెదనవధానికి
ధీమతుడీ శంకరన్నదీప్తికి సతమున్
నేమము నిష్ఠల బుధునికి
ప్రేమగనంత్యాక్షరంపువేల్పుకు సతమున్



నాపేరు: *మాడుగుల మురళీధర శర్మ*  *సిధ్ధిపేట*          ఈరోజున నిర్వహించబడు దృశ్య శ్రవణ అష్టవధాన కార్యక్రమానికి స్వాగతం! సుస్వాగతం!               
ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పంథాలో పుంతలు త్రొక్కిస్తూ నిర్వహిస్తున్న సాహితీ లోకావధాన విస్తారకక్రియా బంధు
బ్ర.శ్రీ.గోగులపాటి కృష్ణమోహన్ గారికి, సంయోజకులు బ్ర.శ్రీ.గుళ్ళపాటి కాంతి కృష్ణగారికి,
వర్ధమాన యువావధాని
బ్ర.శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారికి స్వాగతం,సుస్వాగతం.           
ఈరోజున  పృఛ్ఛకునిగా నాకు ఇచ్చిన

అంశం: వర్ణన.                     
నేనిచ్చే వర్ణనాంశం:                       
*త్రిలింగ క్షేత్రమైన,త్రివేణీ సంగమమై విరాజిల్లుతున్న  కాళేశ్వరం క్షేత్రములో ఒకే పానవట్టముపైవున్న
*శ్రీకాళేశ్వర-ముక్తీశ్వరస్వామివారు  శుభానందాదేవిలపై* స్వేచ్ఛా వృత్తంలో వర్ణించాలని  అవధానిగారిని కోరుతున్నాను.
     *ధన్యవాదములు.*

వర్ణన అంశానికి-
అవధాని గారి పూరణ

వ్యాళవిభూషాదేవా!
కాళీ కేళీవిలాస* గౌతమి వాసా!
భోళాశంకర బ్రోవర
కాళేశ్వరముక్తినాథ* కరుణాభరణా!



 అష్టకాల విద్యాచరణ్
*ఆశువు - కుచేల స్నేహ ధర్మం

పద్యం:* కుచేల స్నేహ ధర్మం
అవధాని గారి పూరణ

పేద సాదలనగ బేధము లేనిది
స్నేహగీతి ప్రజల చేరువగును
ప్రేమ పంచె కృష్ణ వీక్షణ వరము భూ
సురకుచేలునేలె స్తోత్ర విధిన



దత్తపది
అవధాని గారు మతి,గతి,పతి, సతి, ఈ నాలుగు పదా లతో మీ,అవధాన అనుభూతిని వర్ణిచండి డా ముదిగొండ అమరనాథశర్మ


మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ గారు

అప్రస్తుతం  1
అవధానిగారికి నమస్కారం
గతపదిరోజులగా రామాయణకథలో
రాముడెదుర్కొంటున్న సమస్యలో లక్ష్మణుడు
చేదోడుగా ఉన్నాడు
ఈరోజు
మీ సోదరుడేమీకు సమస్య

మీ సమాధానం
ఏమిటి

అవధాని గారి సమాధాము...
మా సోదరులు నాకు దక్షిణామూర్తి సమానులు... సమస్య వారే... సమాధానమూ వారే...

అప్రస్తుతం  2
లాకుడౌనులోన లాస్యప్రియులుమీరు
యింటిలోననుండి యిష్టముగను
యేమి చేయుచుంటి రేమనకుండగా
ధర్మపత్నిమెచ్చు దారిగనుచు

అవధాని గారి పూరణ
అమ్మాశతకమువ్రాసితి
నెమ్మదిగానింటిలోననేస్తముదయితై
కొమ్మలఫలములెగద
మమ్ములనీస్థాయినిలుపుమహిసహనమునై



అవధాని గారికి నమస్సులు.🙏🏻
పేరు : పద్మ చిగురాల, హైదరాబాదు
అంశము : *న్యస్తాక్షరి...*

రామరక్ష  అక్షరాలను

*రా* మొదటి పాదంలో మొదటి అక్షరం
*మ* రెండో పాదంలో నాలుగో అక్షరం
*ర* మూడో పాదంలో నాలుగో అక్షరం
*క్ష* నాలుగో పాదంలో ఐదో అక్షరం
 
🙏🏼పద్మ చిగురాల🙏🏼
అవధాని గారి పూరణ
అంశము...న్యస్తాక్షరి
కం.
రామునిదలచ కరోనా
భామను మంత్రించి చంప వైద్యుని రీతిన్
సీమల రక్షణజేయగ
రాముడ దీక్షల కనుగొనగ రారా భువికిన్.
ప్రశంసాపూర్వక అభినందనలు

అవధాని: అత్యద్భుతంగా అవధానాన్ని నిర్వహించినశ్రీ మాడుగుల నారాయణమూర్తిగారిని అభినందిస్తు ....
శ్రీమాడ్గులాఖ్యవరవంశసుధాకరాయ
అష్టావధానకలనాసువిశేషణాయ
నారాయణాయ కవయే శుభమాశుదద్యాత్
రాజేశ్వరః ప్రథిత వేములవాడ వాసః 👏🌸😊🌺ముత్యంపేట గౌరీశంకర శర్మ


సోదరుడైన మూర్తి బహు సుందరమౌ యవధాన విద్యలో
మోదము గల్గుతీరు కవి ముఖ్యుల ముందిట ధారణాంగుడై
రాదను పల్కులేక జన రంజకమైన కవిత్వ శైలిలో
నాదము జేసె ,దీవనలు నారయ తమ్ముని కందజేసెదన్.
..డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ


అభినందనలు

దృశ్యశ్రవ్య అష్టావధానం 3వ రోజు కూడా అద్భుతంగా శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారు మాడుగుల నారాయణ మూర్తి తో చేయించారు.
శ్రీకాంతి కృష్ణ గారు అనుసంధానం చేశారు.
అవధానం సఫలీకృతం.

సోదరుడైన మూర్తి బహు సుందరమౌ యవధాన విద్యలో
మోదము గల్గుతీరు కవి ముఖ్యుల ముందిట ధారణాంగుడై
రాదను పల్కులేక జన రంజకమైన కవిత్వ శైలిలో
నాదము జేసె ,దీవనలు నారయ తమ్ముని కందజేసెదన్.

..డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ

దారయు ధైర్యము నిండుగ
ధారణతోకదలెనేడు తాదాత్మ్యముతో
పూరణచక్కగచేయగ
నారాయణశర్మగెలిచె నలుగురిమనసుల్
- మల్లావజ్జుల

అష్టకాల విద్యాచరణ్ స్పందన..
అలవోకగపూరణలను
అలసాగెడు పడవ రీతి నందించెనుగా
అలుపెరుగని యవధానిగ
కలిమిని యిక పంచు వాణి కామేశ్వరియై

అష్టకాల విద్యాచరణ శర్మ🙏🙏🙏


 అవధానిగారు శ్రీ మాడుగుల నారాయణమూర్తి గారు బహురమ్యంగా అష్టావధానాన్ని నిర్వహించారు.మంచి ధారతో,ధారణతో,పాండిత్యంతో అంశాలను పూర్తిచేసిన వారికి అభినందనలు.అలవోకగా,చక్కని వివరణలతో ఆద్యంతమూ ఆసక్తికరంగా నేటి అవధానం సాగినది.నిత్యావధాన క్రతువు అవధానుల యాజ్ఞికంతో విజయవంతంగా కొనసాగుచున్నది.గోగులపాటి కృష్ణమోహనన్నకు కృతజ్ఞతలు🙏
రామక కృష్ణమూర్తి

మాదుసహోదరుండునిట*
మాన్యతగానవధానికాగతా
కీదుమహోజ్వలంపునవ*
కీర్ణరసార్ణవపద్యధారణా!
గాదిగ తావిరాజమగు*
కాంతిప్రభల్విరజిమ్మునట్లుమా
సోదరుకాశిసుల్నిడెద*
సుందరదృశ్యపుటావధానమున్!

శుభాశీస్సులతో....
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట

స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్
నిర్వాహకులు

యూ ట్యూబ్ లింక్ కొరకు

https://youtu.be/54njnnYQqqQ

Sunday, April 19, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 2

దృశ్య శ్రవణ అష్టావధానము - 2

స్వస్తిశ్రీ శార్వరీ నామ సంవత్సరము,
ఉత్తరాయణము, వసంతృతువు,
చైత్ర బహుళ ఏకాదశి,
శనివారము...

అవధాని

బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ

సంయోజకులు

శ్రీ అష్టకాల విధ్యాచరణ్


నిర్వహణ
గోగులపాటి కృష్ణమోహన్

*పృచ్ఛకులు*
సమస్య : మాడుగుల నారాయణ మూర్తి గారు
దత్తపది : డా|| రామక కృష్ణమూర్తి గారు
వర్ణన : మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ గారు
ఆశువు : అమరవాది రాజశేఖర శర్మ
శ్లోకానువాదం : డా|| ముదిగొండ అమరనాథ శర్మ గారు
అంత్యాద్యక్షరీ : జ్ఙానప్రసూన గారు
దృశ్యం : గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
నిషిద్దాక్షరీ : మాడుగుల భాస్కరశర్మ గారు

స్వాగతమీవధానబుధవర్యులుశంకరశర్మగారికిన్
జాగృతి తెల్గుభాషసహజాతమువెన్నెలకాంతిరేఖలై
మీగడసున్నితంపుపదమేవిధిహాయినిగూర్చునోగదా
రాగలయాన్వితంపురసరంజితమైసభ కీర్తిపొందగన్
మాడుగుల నారాయణ మూర్తి

బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ

దైవ ప్రార్ధన

సమస్య

మాడుగుల నారాయణ మూర్తి గారు

సమస్య:
గౌరీశంకరుడేకరోనవలపై కల్యాణమాడెన్గదా

అవధాని గారి పూరణ:-
సారాచారవిచారదక్షుడైసర్వంసహామండలిన్
శ్రీరమ్యుండై వెల్గువేల్పు విషమున్ క్షీరమ్ముగాద్రాగితా
పేరున్గాచెను శంకరుండుననువై భీతిన్ కరోనానుతా
గౌరీశంకరుడే కరోన వలచెన్ కల్యాణమాడెన్ గదా!!

అంశము : దత్తపది

రామక కృష్ణమూర్తి
దత్తపది
ఆది, సోమ, మంగళ, బుధ - అనే పదాలను ఉపయోగించి భాగవతార్థం వచ్చే విధంగా, ఏదేని వృత్తంలో తెలుపగలరని మనవి🙏


అవధాని గారి పూరణ:-
ఆదిపురాణపురుషుడు ఆ  యుగకర్తయే కృష్ణమూర్తియౌ
వేదము సంగ్రహించి పరువేగగా సోమకు ద్రుంచివేసి ని
ర్వేదకరుండు రాక్షసుని వేగమె చంపుచు మంగళాత్ముడౌ
మోదము గూర్చె భక్త బుధ మోహనరూపుని అంజలించెదన్


వర్ణన

మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ గారు

అంశము : వర్ణన :-
భక్తులతోకిటకిటలాడే
బాసరదేవాలయములో భక్తులు లేక
సరాసరి
గౌరీశంకరన్నకలములోచేరిన
అమ్మవారిని వర్ణన

అవధాని గారి పూరణ
ఈతరిలోకభీకరము యీకరుణాగతవేళలోనస
ఛ్ఛేతమునందునుండి విెశిష్టగుణోజ్వల వాసరేశ్వరీ
నేతలులేకచేసేడి పనేమియులేకకలంబులౌ
ఖ్యాతిగవచ్చిచేరెనను కారణమున్ సృజియించినావు
ఆ మాతసరస్వతీ రుచీరమాన్ర వచౌమకరందధారలున్
భ్రాతకునిన్నునన్ను  పరివారమునందరి బ్రోచుగావుతన్

ఆశువు

అమరవాది రాజశేఖర శర్మ
 ఆశువు...ఈ మాసం రోజులుగా తిరపతి వేంకటేశ్వరుని మనోగతం ఆశువుగా చెప్పండి

అవధాని గారి పూరణ
అరయగ మాసమంతటను హాయిగ భక్తులు లేకపోవుటన్
తిరుపతి వేంకటేశ్వరుడు దివ్యముగా తన కాంత తోడుతన్
స్థిరముగ కూరుచుండెనట చిత్తమునందున బాధలేకయున్
వరుసలవేమిలేవు మరి వాదనలున్ వినిపించబోవుగా
కెరిసెడికాసులేదయిన కూర్చెనుమానసిక ప్రశాంతతే


శ్లోకానువాదం : 
డా|| ముదిగొండ అమరనాథ శర్మ గారు

శ్లోకానువాదం
యా దేవీ సర్వభూతేషు విష్నుమాయేతి శబ్దితా | నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ
అవధాని గారి పూరణ
ఏదేవిసర్వ భూతములాధారముగ వసించునఖిల జగంబుల్ ఆదేవిమాతృమూర్తికి  శ్రీదేవికి వందనములు స్థిరముగ జేతున్ డా ముదిగొండ శ్లోకాను వాదం

అంత్యాద్యక్షరీ
జ్ఙానప్రసూన గారు

అంత్యాద్యక్షరి
సీసమాలిక.
**********
రామునిచరితమ్ము రమణీయ మౌనట్లు
          రచియించె కవయిత్రి రమణి మొల్ల
స్వాతంత్ర్య సంగ్రామ సారిణి యైతాను
          రణరంగ మునదూకె రాణిఝాన్సి
కాకతీయులరాజ్య ఘనతను పెంచిన
          రుద్రావ తారిణి రుద్రమాంబ
కోటివీణలుమీటు కోయిల స్వరమున
          జనులమదినిదోచె జానకమ్మ
మానవ సేవయే మాధవ సేవని
    మహినితెలియజేసె మదరు థెరిస
పటిమతోడనుదేశ పాలన చేసిన
       ఇంతిగావెలుగొందె నిందిరమ్మ
తే. గీ.
*****
నాటి నుండియు గొప్పగా నేటివరకు
అన్ని రంగము లనుగూడ నధిగమించి
విశ్వ సుగతిని చాటిన వెలదులార
అందు కొనుడమ్మ యివియెమా వందనాలు

*రచన** *జ్ఞాన ప్రసూనాశర్మ*  *ఎల్లికంటి*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

అవధాని గారి పూరణ:-

లేములనుబాపి రక్షించు లేములాడ
వేద సంస్కృతి సుమమాలవేములాడ
రాజ రాజేశ్వరస్వామి (దే) రాజ్యమాడ
మహిత బంగరు తెలగాణ మధురవీణ

అంశం... దృశ్యం
దృశ్యం : గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

అవధాని గారూ నమస్కారం. ఈ దృశ్యం పై మీ స్వేచ్ఛా ఛందంలో పద్యమందీయండి.

దృశ్యం
అవధాని గారి పూరణ
ఆకరోనకు యువతులు నదిరిపడగ
నట్టిచిత్రము మనకు చూపెట్టినట్టి
యానకాశి చిత్రము నద్భుతముగ
తీర్చిదిద్దిన ఘనునికి దివ్యనతులు


అంశం: నిషిధ్ధాక్షరి

మాడుగుల మురళీధర శర్మ

ప,ఫ,బ,భ,మ అనే ఓష్ఠవ్యములు లేకుండా
రామాయణం గూర్చి స్వేచ్ఛా వృత్తంలో ఒక పద్యం చెప్పగలరు.

అవధాని గారి పూరణ



గౌరీశంకరశర్మ‌ అవధానిగారు నేటి అష్టావధానాన్ని‌ చాలా బాగా చేసారు. అన్ని అంశాలను‌ కడు సమర్థవంతంగా,అర్థవంతంగా,ఆహ్లాదంగా పూర్తిచేసారు.వేగం,స్పష్టత,ప్రామాణికత వారి సుగుణాలు.కర్ణపేయంగా ఉంటుంది వారి గానం.సమయస్ఫూర్తి, రసరమ్యత,చమత్కారం వారి అవధానానికి అలంకారాలు.అలవోకగా అష్టావధానాన్ని పూర్తిచేసిన అవధానతిలకునకు అభినందన విజయ మాలలు.

డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.


అందరికీ వందనాలు.దృశ్యశ్రవణ అవధానం చాలా చక్కగా విజయవంతమైంది.రూపకర్తలు గోగులపాటివారికి,సంయోజకులు అష్టకాల వారికి,అవధానిగారికి  శుభాభినందనలు.సమీక్ష కాకుండా. చిన్న ప్రతిపాదన.కొంతసమయం ఎదిరిచూడవలసి వచ్చింది.కొంచెం మార్పుతో సమన్వయకర్తలు/సంయోజకులకు పృచ్ఛకులు వ్యక్తి గతంగా వీడియో పంపిస్తే క్రమానుసారంగా ఒక్కొక్కటి వారు బృందంలోకి పంపాలి.అవధాని గారి సమాధానం రాగానే రెండవది పెట్టాలి.ఇలా అయితే సమయం క్రమబద్ధమౌతుంది.ఆలోచించగలరనివినతి.మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా


[19/04, 8:49 AM] Poet Prasoona Sharma: శివపూజాదురంధరులు, సౌమ్యులు , అవధానతిలక  బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారికి శతాధిక  వందనాలు.
     ఆన్లైన్ ద్వితీయ అవధానాని అలవోకగా ,అద్భుతంగా చేశారు. అవధాన సరస్వతులను అభినదించడానికి కూడా నాఅర్హత చాలదేమో.
     శ్రీకృష్ణమోహన్ గారు నూతన కార్యక్రమాన్నీ సృష్టించి   ఈకార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చెయ్యడం నాసుకృతం.వారికి అభినందనలు.
       సంయోజకులు విద్యాచరణ్ గారు పద్యరచనలో ఘనులు. స్నేహశీలి. కార్యక్రమాన్ని చక్కగా. సమన్వయం చేశారు.
 
అమరవాది రాజశేఖర శర్మ గారి అభినందనలు

ఈ దృశ్య శ్రవణ అవధానము యూట్యూబ్ లో వీక్షించుటకొరకు ఈ క్రింది లింకును క్లిక్ చేయండి

https://youtu.be/AmLIhrp5kaA
అందరికీ  నా హృదయ పూర్వక. అభినందనలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 గోగులపాటి కృష్ణమోహన్ ✍🏼: 

Friday, April 17, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము

తొలి దృశ్య శ్రవణ అష్టావధానము

సాదృశ్యశ్రవణావధాన రుచిర ప్రజ్ఞా సుధామాధురీ
తాదృగ్వాణి విచారధార ధిషణోదార స్వభాసావరీ
యేదృక్పండిత మండితాన్విత సమానీయోత్తమా వాగ్ఝరీ
మాదృగ్బాల ముకుంద పల్లవ కరోన్మత్తాప్రమత్తాకరీ ||

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణము, వసంతఋతువు ,
చైత్ర మాసము, కృష్ణ దశమి,
శుక్రవారము అనగా తేది 17-4-2020 మధ్యాహ్నము 
1-30 గంటలకు  మొట్టమొదటి 
దృశ్య శ్రవణ అవధానము నిర్వహించబడింది

అవధానవర్యులు

శ్రీమతి & శ్రీ గౌరీభట్ల రుక్మిణీ బాలముకుంద శర్మ, గోలోకాశ్రమము, సిద్దిపేట

సంయోజకులు: 
శ్రీ పవన్ కుమార్ శర్మ, కామారెడ్డి

నిర్వహణ : 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్, 
సూరారంకాలని, హైదరాబాదు.

పృచ్ఛకులు
శ్రీ ముత్యంపేట గౌరిశంకరశర్మ - న్యస్తాక్షరి
శ్రీ అష్టకాల విద్యాచరణ్ - దత్తపది
శ్రీ రామక కృష్ణమూర్తి - దృశ్యం
శ్రీ మాడుగుల భాస్కర శర్మ -  చంధోభాషణం
శ్రీమతి జ్ఙానప్రసూన శర్మ - వర్ణన
శ్రీమతి పద్మ చిగురాల - సమస్య
శ్రీమతి బాలసుజాత - అంత్యాదక్షరి
శ్రీ నందబాల శర్మ  - అప్రస్తుతం


ప్రార్ధన
స్థానవిశేషమే గణపధామముగా మది భావనంబుతో
స్థానవిశేషమే వరవిధాయిని వాణి సరూపమంౘు సం
స్థాన శేషమే సదవధానపు పృచ్ఛక బృందమంచు నీ
స్థాన విశేషమే మది విచారము గల్గగ జేయు భారతీ!


రామక కృష్ణమూర్తి
అంశము : దృశ్యము


శ్రీ కృష్ణుని పాదాలు


శ్రీ కృష్ణుని పాదాలు

*రుక్మావతి ఛందస్సు:*

1)ప్రతిపాదంలో భ,మ,గ,స అనే గణాలు వస్తాయి.
2)1-6 అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది
3)ప్రాస నియమం కలదు

చిత్రానికి పద్యము.....

కృష్ణవిభో సంక్లిష్ట గృహస్థ
స్యోష్ణ కరోనా శుద్ధ కృతార్థే
వృష్ణి కులోద్భవ్యేష్ట పదాబ్జౌ
హిష్ణుతయా వందే హృది రంగే



ముత్యంపేట గౌరిశంకర శర్మ
అంశము: న్యస్తాక్షరి


భా


ము
ప్రతి పాదంలోను మొదటి అక్షరంగా చెబుతూ
మోదీ గారిని వర్ణించండి
స్వేచ్ఛా ఛందము

అవధాని పూరణ
న్యస్తాక్షరి....

భార తమమైన కార్యసంభావ్య శీల
రణ వరాంగణ లక్ష్య వైరాజ జేత
తరుణ తారణ వరణీయ ధన్యజీవి
ముసలమౌ శత్రుమూకకు మోడిఁదలతుముసలమౌ శతృమూకకు మోడి దలతుదలతు


మాడుగుల భాస్కర శర్మ -  
చంధోభాషణం.1

వీణా పుస్తకపాణిమాటలెటుగా
అవధాని పూరణ
విన్పించెనిచ్చోట మా
వాణిన్ ప్రశ్నలు వేయుకాలమున ,శ్రీ
వాగ్దేవ విన్పించరే
*ప్రాణాపానసమావధాన కలితా లాస్యోద్భవా భారతీ*
*వీణానాదమె యీవధానమున తావీక్షించు పృచ్ఛాళిగా*

ఛందోభాషణము .2.

చీరలుదాచి గోపికల సేమము గోరునె కృష్ణడచ్చటన్
అవధాని పూరణ
వారలవస్త్రహీన పరివార విచేష్టల మాన్పబూని తా
గోరెను ధర్మబద్ధ గుణ
కూరిమి నేర్పగ కోర్కె దీర్పగన్

జారిణులన్ పడేయనగు
జారుడు గాడె యశోద పట్టియున్


దోర్బల బాలసుజాత 
అంత్యాద్యక్షరి

దేవా! దీనజనావనా! శుభకరా దివ్యప్రభా భాసురా!
రావా రాల్పగ నీదయార్ద్ర రస ధారన్ చంద్రమౌళీశ్వరా!
నీవే లోకుల పాలి పెన్నిధివిరా నీసన్నిధిన్ గూర్పరా
సేవన్ జేసెద ముక్తిమార్గమిడరా శ్రీ రాజ రాజేశ్వరా

అవధాని పూరణ
రాజిత వారాహీ సమ
ధీజన జట శూల పార్వతీ యువిదలిలన్
గోజిత రాజేశ్వరున
వ్యాజముగా ముదము గొలుతు భక్తిగ మదిలోన్


అష్టకాల విద్యాచరణ్
దత్తపది...

పాములు, పాములు, పాములు, పాములు,
స్వార్థంలో గాని, అన్యార్థం లో గానీ ప్రయోగించి.
సర్పయాగ వర్ణన..

అవధాని పూరణ
పాముల పాముటేల కలివైనము బాధ్యతగా పరిగ్రహిం
చే మహిషాసకుండగు విజేత పరీక్షితు పాములాటలో
పామరుడై మృతిన్ గొనుట భావ్యమె పాముల జాతి లక్షణం
 బే మృతిగాంచు జన్నము సుభిక్షము పాముల జన్మ ధన్యమున్

పద్మ చిగురాల
సమస్యాపూరణము...

సమస్య
*శార్దూలంబుకు బావగావలె సుమా శ్వానంబు, సింహంబులున్..!*

అవధాని పూరణ:
దర్దూరాస్యమునందు కీటకము సంధానించు వైనంబు స
మ్మర్ధారణ్య మృగాళి కేళి రవళీ మాత్సర్యవైరుధ్యమం
తర్దీనత్వముగాంచె నెయ్యమున సద్భావంబు జన్యమ్మయెన్ ,
శార్దూలంబుకు బావగావలె సుమా శ్వానంబు, సింహంబులున్..!

జ్ఙాన ప్రసూన శర్మ 
వర్ణన

వర్ణన.  :కర్ణుని లోభత్వం

అవధాని పూరణ
ఆ.వె
*****
తల్లు లిరువురికిని తాసేవజేయక
తమ్ము లేవురనిన నమ్మబోక
అంగ దేశమునకు నాధిపత్యమొదల
లేని కర్ణుడతడు లిప్తలోభి

ఈ అవధానం పూర్తిగా యూట్యూబ్ లో చూడటానికి

https://youtu.be/P1nPyhKoMRQ

మీ
గోగులపాటి కృష్ణమోహన్

స్వస్తి