Friday, April 24, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 7

*దృశ్య శ్రవణ అష్టావధానము - 7*

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం, శుద్ధ పాడ్యమి
గురువారం, తేది 23-04-2020

అవధానవర్యులు:
*గౌరీభట్ల రఘురామ శర్మ  గారు*
గౌరీభట్ల కులోత్పన్నం 
రఘరామావధానినం ! 
నౌమి సారస్వతాకారం 
విద్వజ్జన విభూషితమ్ !!...
విఖ్యాత అవధానులు గౌరీభట్ల రామకృష్ణశాస్త్రిగారి ద్వితీయ పుత్రులు రఘరామశర్మగారికి నమస్సులతో ...

స్వాగతం🌸🌺👏
సంయోజకులు:
*బ్రహ్మశ్రీ ముదిగొండ అమరనాథశర్మ గారు*

నిర్వహణ :
*శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు*

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*
౧) సమస్య - శ్రీ కాసుల శ్యాంసుందర్ గారు
౨) దత్తపది - శ్రీ పార్వెళ్ళ శ్రీధర్ శర్మ గారు
౩) వర్ణన - శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు
౪) నిషేధాక్షరి - శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు
౫) వ్యత్యస్తపాది - బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకరశర్మ గారు
౬) ఆశువు - శ్రీ ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు
౭) అప్రస్తుతం - శ్రీమల్లావఝల చంద్రశేఖర్ శర్మ గారు
౮) అంత్యాదక్షరి - శ్రీమతి దోర్భల బాలసుజాత గారు



సంయోజకుని ప్రార్ధన-ఆహ్వానము


అవధాని ప్రార్ధన


సమస్య - శ్రీ కాసుల శ్యాంసుందర్ గారు

సమస్యాపూరణము:
సమస్య:"ధూమము కాలుష్యమడచి తుష్టిని గూర్చునా .

పూరణ: కామిత దాయక వైదిక
క్షేమాలంకారసార కీర్తి భరితమై
శేముషి యజ్ఙము హోమము
ధూమము కాలుష్యమడచి తుష్టిని గూర్చున్ .

దత్తపది - శ్రీ పార్వెళ్ళ శ్రీధర్ శర్మ గారు

దత్తపది
త్రిశూలం,త్రినేత్రం, త్రిపుండ్రం,త్రిదళం   
అనే  పదాలతో శివకేశవుల అభేదమును వర్ణించండి.

దత్తపది పూరణ
అత్త్రిశూలమ్శుకుజనాళినణచివేయ
అత్త్రినేత్రాగ్ని దుర్వ్యాధినార్పివేయ
అత్రిపుండ్రైక శోభిత హరిహరులను
అత్రిదళములనర్చించినభినుతింతు



వర్ణన - శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు

వర్ణన
తల్లిదండ్రులను నడిచే దేవతలంటారు
వారి ఔన్నత్యాన్ని వృత్వతంలో ర్ణించ ప్రార్థన

వర్ణన పూరణ

నిలకడ దివ్యదేవతల నిర్మల సంస్కృతి నావరించు మం
గళకర మూర్తిమత్వమగు కాంక్షలనుల్లసిలంగనిత్యమున్
వెలుగుల రూపుదిద్ద నిలవేల్పులనౌ యిల తల్లి దండ్రులన్
సలలిత చిత్తశుద్ధులుగ సంస్తుతి చేసిన జన్మ ధన్యమౌ


నిషేధాక్షరి - శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు

అంశము: నిషేధాక్షరి
అయ్యా నమస్కారములుశుభాభినందనలు.
నేనిచ్చిన అంశం:నిషేధాక్షరి.
కచటతపలు లేకుండా భాగవతముపై పద్యము.

నిషేధాక్షరి పూరణ
*కందము*
జగములవైరాగ్యమ్మును
భగవల్లీలావినోద భాగ్యంబనగన్
సగుణముగానినునమ్మిన
సుగుణంబగు సజ్జనాళి సుస్థిర వరమౌ!!


ఆశువు : యం మల్లికార్జున శర్మ

అవధాని గారికి నమస్కారం,
 పేరు : యం మల్లికార్జున శర్మ
అంశం:ఆశువు
"విశ్వవ్యాప్తమైన కరోనా వ్యాధి శైవ మహా క్షేత్రాలలో ప్రత్యేకించి ఎక్కడా విస్తరణ లేదు, ఇందుకు గల కారణం ఆశువు  పద్యం ఏదైనా వృత్తంలో

అశువు పూరణ

"శోకములబాపు తాను సుశ్లోకుడగుచు
భవ్య దివ్యౌషధుల భిషక్ వరుడునగుచు
రుద్రుడాడినచోట కరోన రాదు
క్షేమకరమైన శైవైక క్షేత్రములవి"

వ్యత్యస్తపాది - బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకరశర్మ గారు

నాపేరు:- ముత్యంపేట గౌరీశంకర శర్మ  అంశం:- వ్యత్యస్తపాది . పార్వతీ పరమేశ్వర కళ్యాణం . మత్తేభం లో వరుసగా 4వపాదంమొదలు 3వ2వ1వ పాదాలు చెప్పండి

వ్యత్యస్తపాది.
వరుసగా4,3,2,1, పాదాలు చెప్పి వర్ణించుట
వ్యత్యస్తపాది.
వరుసగా4,3,2,1, పాదాలు చెప్పి వర్ణించుట

పద్యపూరణ
ఘోరంబైనటువంటి తారకునటన్ గూల్చన్ కటాక్షించుచున్
ప్రారంభించకుమార సంతతిని సభ్యశ్రేణి లెక్కించగా
ప్రేరేపించగ సత్కళాకృత కళావిష్కార చైతన్యులౌ
గౌరీశంకర లగ్నమైవరలె సంకల్పమ్ము సిధ్ధించగా


అంత్యాదక్షరి - శ్రీమతి దోర్భల బాలసుజాత గారు

అంత్యాద్యక్షరి

కోకిల కూహురావములు, కొమ్మల మాటున కీర గానముల్,
వాకిట కంటికింపయిన, భవ్య మయూర మనోజ్ఞ
నృత్యముల్,
తాకగ వర్షశీకరము తన్మయ మందిన జానకీ మదిన్
నాకము పర్ణశాలఁ గని నాధుని చూచెను హర్షమొందుచున్.

అంత్యాద్యక్షరి
అవధాని గారి పూరణ

చంచల నీదు భార్యయు అచంచల దీక్ష గా నమ్మి కొన్న
గుర్తించియు భాగ్యమీయదకో
దీనుల పాలనికెట్లు గల్గు
లెక్కించెడు నెంతవాడను లిఖించిన బ్రహ్మకే అంతుబట్టదౌ
అంచిత యాద శైల విభవాన్వయ శ్రీ నరసింహ దేవరా

అప్రస్తుతం - శ్రీమల్లావఝల చంద్రశేఖర్ శర్మ గారు

ప్రశ్న 
అవధానిగారూ పొగకు మీకు సంబంధం ఏమిటీ

అవధానివగారి సమాధానం 
యజ్ఞం పోగ అంటే అది ధూమము... అది కాలుష్య నివారణ చేస్తుంది నాకు ఇష్టము

ప్రశ్న
అవధానిగారూ అడ్డ  నామాలు నిలువునామాలు రెండూ ఒకటేనా

అవధానివగారి సమాధానం 
అవును నామాలు ఒకటే... అడ్డం నిలువే తేడా

ప్రశ్న
మహాభారతం లో
మీకు నచ్చని పాత్ర
నచ్చిన పాత్ర గురించిచెప్పండి

అవధానివగారి సమాధానం 
నచ్చిన కృష్ణుడు 
నచ్చని పాత్రధుర్యోధనుడు

శ్రీ రాధమ్మయురామకృష్ణకలగా
సృష్టించెపద్యమ్ములన్
మెట్ రామన్నకుతోడునిల్చినడిచెన్
మేధస్సుయజ్ఞమ్ములో
ధీరుండై మది దార ధారణలతో ధీ వాణి చేబట్టగా
గౌరీభట్ రఘురామశర్మ కవిసా
క్షాత్కారమావాణి యై


మూడవపాదములో వాణి

రఘురామశర్మగారి సహధర్మచారిణి

నాలుగవపాదంలో వాణి
ఆ సరస్వతీ అమ్మవారు
మల్లావఝల చంద్రశేఖర శర్మ

నమస్కారం
స్పందన
............
శ్రీ రఘురాముని వాణి సుధారసమవధానమందు ధారణ నిల్పెన్
వారధి ముదిగొండయునీ
ధారకు మూలమ్ము కృష్ణ తత్త్వము నిండెన్
ప్రేరకులును,ప్రాశ్నికులును
ధారణలనుదెల్పెడియవధానులు శ్రోతల్
భారతి దివ్యసుపుత్రులు
హారతులీ తెల్గులోమహాకవి తతికిన్.
......
మాడుగుల భాస్కర శర్మ



యూట్యూబ్ లింకు కొరకు
https://youtu.be/Is2JQ8JqH3Q

Thursday, April 23, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 6

*దృశ్య శ్రవణ అష్టావధానము - 6*

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం, శుద్ధ పాడ్యమి
గురువారం, తేది 23-04-2020

అవధాని

శ్రీ అవుసుల భానుప్రకాశ్ గారు


సంయోజకులు

బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు


నిర్వహణ 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

నేటి అవధానంలో
*అంశాలు - పృచ్చకులు*

౧) సమస్య - శ్రీ భూమయ్య గారు
౨) దత్తపది - శ్రీ రాజయ్య గారు
౩) వర్ణన - శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు
౪) ఆశువు - శ్రీ రవికుమార్ గారు
౫) దృశ్యము - శ్రీ కొత్త మురళి గారు
౬) అంత్యాద్యక్షరి - శ్రీ మాడుగుల భాస్కర్ శర్మ గారు
౭) న్యస్తాక్షరి - శ్రీ పాద బాలాజి గారు
౮) పాటకు పద్యం - శ్రీ మహమ్మద్ షరీఫ్ గారు

ప్రార్థన
అవధానమ్మిది వాక్కులమ్మ దయతో నాన్లైను సాగించెగా
స్తవనీయమ్మగు ప్రశ్న వేయ నిడుదున్ సాహిత్య వాక్స్వాదువున్
రవళించున్ గద శబ్దశక్తివరలన రమ్యాక్షరీ భారతీ
హవనంబిద్దియెజాలువారు నిపుడా హ్లాదంబు నందించగన్

2.మరుమాముల దత్తన్నయు
సురుచిర సంయోజకుండు సొంపొలరారన్
చరవాణిన గొనసాగగ
వరనీయమ్ముగ నడుపుడు వందనమిదియే.

3.దృశ్య రూపమ్ముగశ్రవణ దీపికముగ
వరలు యవధాన కేళికి వాసితెచ్చె
అతడు గోగులపాటియై నవని నిలిచె
పద్యకవి యవధాన మై పరిమళించె












సిహెచ్. భూమయ్య,
తెలుగు భాషోపాధ్యాయులు,
నారాయణఖేడ్.
అంశము : సమస్య:
శవమును జూచినంత కడు సంబరమొందెను కన్నతల్లియే!

అవధాని పూరణ:-
*చ.*
ప్రవిమల మాతృభావనము భారత దేశపు కీర్తిహేతువౌ
ఛవినల విశ్వమంతటను చాటగ శక్తికుటుంబమందునన్
హవనమె పెంపకమ్ము గద హాయిగ పిల్లలెయాటలాడ, శై
శవమును జూచినంత కడు సంబర మొందెను కన్నతల్లియే!












వడ్ల రాజయ్య.
నారాయణ ఖేడ్.

దత్తపది.
పదాలు-సోమ.మంగళ. బుధ.గురు.....
వర్ణనాంశం- తెలుగు పద్యవైభవం.


అవధాని పూరణ:-
సోమచంద్రకల్ వెదజల్లు సొంపులలరు
దివ్య మంగళకరమైన భవ్యశక్తి
బుధులు మెచ్చెడి పద్యమ్ము పూర్ణమదియె
నవ్య గురువుల నాల్కపై నర్తనమ్ము












వరుకోలు లక్ష్మయ్య
తెలుగు భాషోపాధ్యాయులు
ZPHS గుర్రాలగొంది
జిల్లా సిద్దిపేట
తరువాతి:9704865816

*అంశం:వర్ణన*
*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు* *గారు కరోనా వైరస్ కట్టడిపై తెలంగాణ ప్రజలను జాగృతం చేయుచున్న సందర్భాన్ని వర్ణిస్తూ స్వేచ్చా ఛందంలో వర్ణించాల్సిందిగా మనవి.*

అవధాని పూరణ:-
మత్తేభం
సకలమ్మౌ ప్రజలింట నుండ జయమౌ సంతోషమే గల్గులే
వికలమ్మీ కరొనాను పంపమనదౌ వీరత్వమే దివ్యమౌ
అకలంక ప్రతిభా సమానులిచటన్ ఆత్మీయ సేవల్ నిడెన్
ప్రకటించెన్ గద కే.సి.యారు.ఘనుడై ప్రావీణ్యమౌ సూక్తులన్!












టి.రవికుమార్,యస్.ఏ.తెలుగు
జి.ప.ఉ.పా.ముదిమాణిక్,మం:పుల్కల్,జి:సంగారెడ్డి.

అంశం: అశువు
టి.రవికుమార్,
జి.ప.ఉ.పా,ముదిమాణిక్, సంగారెడ్డి.
నా అంశం:ఆశువు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేయడం కోసం లాక్డౌను ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు వచ్చేశాయికదా!ఈసందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులమానసిక స్థితి ఎలా ఉందో స్వేచ్ఛా వృత్తంలో వివరించండి.

అవధాని గారి పూరణ:
పిల్లలు భావిపౌరులనిపేరిమి బంధములల్లుకొన్నవా
రెల్లరుప్రేరణమ్మునిడెనిట్టుల వీడియొలందజేయుచున్
పిల్లలకిష్టమైనవివిప్రీతిగ మక్కువగల్గువాటిపై
నుల్లముజేర్చిసాధనమునొందె కరోనకు వందనమ్మిదే!
   
      ధన్యవాదాలు












దృశ్య శ్రవణ అష్టావధానం-6
పృచ్ఛకుడు: డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ
కాళేశ్వరం
అంత్యాద్యక్షరీ
..................................
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
బూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్రనీ హరములకు
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు
వినుత గుణశీల !మాటలు వేయునేల!


అవధాని పూరణ:-
..................
లలిత భక్తులనిలయమ్ము లక్షణముగ
పరమ ముక్తిని యిచ్చును భక్తతతికి
చదువ పద్యమ్ము మనలను చక్కదిద్దు
దివ్యభాగవతమిదియె దీపితమ్ము.












జి.శ్రీపాదబాలాజి.
తెలుగుభాషోపాధ్యాయులు.సంగారెడ్డి.🙏🏻

అంశము:
న్యస్తాక్షరి - భా-ర-త-ము.  నాలుగు పాదాలులలో ఉపయోగించి  , రామాయణార్థంలో , స్వేచ్ఛా ఛందస్సులో  పద్యాన్ని నిర్మించవలసిందిగా  ప్రార్థిస్తూ వర్ధమాన అవధానికి నమస్సుమాంజలి.
జి.శ్రీపాదబాలాజి.
🌹 అవధాని గారి పద్యపూరణ.
భావి జగతికి సంస్కారం ఫలము లొసగు
రగులుగొల్ప నైతికా రామమదియె
తన్మయమ్ముగ జదువగా ధన్మతలరు
ముక్తి రామాయణమొసగు భక్తి విరియ.   💐

            జై  శ్రీరామ్🙏🏻











పేరు   డా.మహ్మద్ షరీఫ్
భాషోపాధ్యాయులు తెలుగు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల తొగర్ పల్లి
మండలం కొండాపూర్

పాటకు పద్యం
పాట: ఓహో మేఘమాల

అవధాని పూరణ:-
తే.గీ:
చెలికి సందేశ మంపవె కలికి తునక
హృదయ భావంపు గొంపోవు సదయ మతిన
నన్ను మురిపించు చెలిజేర్చు మన్న వినిన
మేఘ చయమది నవ్వెను మిక్కు టముగ











కొత్త మురళి
సంగారెడ్డి జిల్లా.

దృశ్యం

అవధాని పూరణ
పుస్తకములెనాడు నడిపె
మస్తకమున్ నడిపెనేడు మహిచరవాణుల్,
విస్తారమ్ముగ మెదడులు
కుస్తీలే రెంటిమధ్య కొనసాగించెన్!!

పృచ్ఛకుల అభినందనలు

స్పందన
దృశ్యశ్రవణమైన దీప్తిలోనవధాన
ధారలు ప్రవహించె ధారణలుగ
భానుప్రకాశమీ వాట్సాపు మాధ్యమ
సాహిత్యవీధినాశ్చర్య పరచె
సంయోజకత్వమ్ము సాగె దత్తాత్రేయ
వాణితో తెలుగు సంవర్ధితమ్ము
గోగులపాటి సత్కూర్పులు నిండిన
కృష్ణమోహన రూప కీర్తియుతము

సకల సంపూర్ణ సత్కవిసంతసముగ
అద్భుతమ్మగువిధముగా అడిగినట్టి
ప్రాశ్నికుల ప్రశ్నలకుజెప్పె ప్రజ్ఞతోడ
ధన్యవాదములందరు మాన్యులకును.
..డా.మాడుగుల భాస్కర శర్మ


కందపద్యం.
ప్రవిమల దత్తాత్రేయులు,
కవి గోగులపాటి కృష్ణ గారల కృషితో,
యువకవి వధాని భానుని
కవితలు పొంగారె నేడు కమనీయమునన్.
...వడ్ల రాజయ్య.
SA Telugu.ZPHS కల్హేర్,నారాయణ ఖేడ్


పద్యం.
🌹🌹🌹🌹🌹🌹
దృశ్య శ్రవణ ఆన్లైన్అవధాన రూపకర్త శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ అన్నకు,
బహుముఖ ప్రజ్ఞాశాలి, అవధాని, సంయోజకులు ,బ్రహ్మశ్రీ మ.దత్తాత్రేయశర్మగారికి,
నేటి కార్యక్రమ సూత్రధారి వర్ధమాన అవధాని శ్రీ భానుప్రకాశ్ గారికి,
నాతోటి పృఛ్ఛకవర్యులకు,
ఈ అవధానంలో  నాకు అవకాశం కల్పించిన  ప్రాజ్ఞులకు శిరసా నమామి.
ఆదర్శంగా, ఆహ్లాదంగా,కర్ణపర్వంగా , అద్బుతంగా అవధానం విజయం చేశారు.
అభినందనలు.💐🌹👌🙏🏻
  నేడు గురువారం దత్తునివారం-దత్తన్నకు వందనం.
 🌻🌻🌻నాపద్యం.🌻🌻
 ☀భారతము పదాలు

పాదాదులను జేర్చి
రమ్యరచనజేసె రామఘనత
భాను సమయబుద్ధి భాసిల్లెనాన్లైన్లొ
దత్తమోహనాట ధరను వరలె.
💐👌👌👌🌹🙏🏻నమ్రతతో, భాషా సేవకుడు
జి.శ్రీపాదబాలాజి.సంగారెడ్డి.


అవధానము దిగ్విజయం చేసిన అవధాని భానుప్రకాశ్ గారికి సంయోజకులు,బ్రహ్మ శ్రీ మరు మాముల దత్తాత్రేయ శర్మ గారికి,నిర్వహకులు శ్రీ గోగుల పాటి కృష్ణ మోహన్ గారికి అభినందనలు.

అవధానిపై అభినంద పద్యాలు
*కం.*
*ఏమా?కవితా శిల్పమ*
*దేమా!పద్యపు నడకది యెన్నో జిలుగుల్!*
*ఏమనియందును మిత్రమ*
*యేమా!పద్యవిభవమది యెంతో ఘనమై!*

*కం*
*కావ్యకళానిధివై!భువి*
*భవ్యామృతభానుతేజ భాగ్యంబలరన్*
*నవ్యపు రీతిని కైతలు*
*సవ్యంబుగనల్లినావు సరసులు మెచ్చన్!!*
*కం*
*చక్కని మీయవధానము*
*నక్కజముగసాగెనేడు నద్భుత భంగిన్*
*చిక్కని పద్యపు శిల్పము*
*చెక్కుటలో భానుమిన్న చేయుదు ప్రణతుల్*
               మీ
   సిహెచ్‌.భూమయ్య,         
నారాయణఖేడ్.


సంయోజకులు.శ్రీ.మరుమాముల దత్తాత్రేయశర్మ గారు మ‌రియు అవధాని శ్రీ .అవుసుల భానుప్రకాశ్ గారుమమ.మరియు ఈకార్యక్రమానికిమూలమైన శ్రీ. గోగులపాటి కృష్ణమోహన్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈకార్యక్రమం పై చిరు స్పందన.
సంయోజకులవారిపై...
*మరుమాముల పండితులూ
పరమోన్నతమైనరీతి ప్రజ్ఞతొ నడిపెన్!                       
సరియగు సవరణ జేయుచు       
మురిపించువిధంబుజేసె మోదముగలుగన్!*

అవధాని గారికి అభినంధన...
*కనివిని యెరుగని తీరుగ     
వినిపించిరిపద్యములను వేడుక తోడన్                            ఘనుడైన భానుగారికి   
వినయంబుగ జేయుచున్న విరివిగ ప్రణతుల్!*   

ధన్యవాదాలు
టి.రవికుమార్ ,
భాషోపాధ్యాయులు,
జి.ప.ఉ.పా.ముదిమాణిక్,మం:పుల్కల్,సంగారెడ్డి.


దృశ్య శ్రవణ అష్టావధానము
అభినందన పద్యాలు
అవధాని శ్రీ భానుప్రకాశ్ గారికి
కం:
అవధానము దృశ్య శ్రవణ
రవళించగజేసె "భాను" రమ్యత భంగిన్!
కవిగా యవధానిగ తాఁ
సవినయముగ నొప్పు చుండె సాహితి జగతిన్!

శ్రీ మరుమాముల దత్తాత్రేయ
శర్మ గారికి
కం:
కన్నుల కనుపడు నట్టుల
మిన్నగు యవధాన మిపుడు మేలుగ బంచన్!
నెన్నగ మరుమాముల తా
వన్నెల సంచాలనమ్ము వాట్సాప్ నందున్!

శ్రీ గోగుల పాటి కృష్ణమోహన్
గారికి
కం:
శ్రీ గోగుల పాటికృష్ణుడ
సాగెను యవధాన మిపుడు సరసులు మెచ్చన్!
వాగీశ్వరి కరుణామృత
సాగరమే యండ మీకు సద్గుణ హితుడా!

         డా.మహ్మద్ షరీఫ్
      సంగారెడ్డి 9866560527

యూట్యూబ్ లింకు కొరకు
https://youtu.be/TtL6Zoy-v24

స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్

Wednesday, April 22, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 5

దృశ్య శ్రవణ అష్టావధానము - 5
(సంస్కృతావధానము)

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంతృతువు,
చైత్ర మాసం, అమావాస్య,
బుధవారం, తేది 22-04-2020

అవధాని : 

బ్రహ్మశ్రీ డా|| అయాచితం నటేశ్వర శర్మ గారు


సంయోజకులు: 

బ్రహ్మశ్రీ పార్వెళ్ళ శ్రీధర శర్మ గారు


నిర్వహణ : 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

సంస్కృతావధానంలో
*అంశాలు - పృచ్చకులు*

1.నిషేధాక్షరీ - శ్రీ మాడుగుల భాస్కరశర్మ గారు
2. సమస్యా - బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకరశర్మ గారు
3.దత్తపదీ - బ్రహ్మశ్రీ ముదిగొండ అమరనాథశర్మ గారు
4.వర్ణనమ్ -  శ్రీ ముత్యంపేట మల్లిఖార్జున శర్మ గారు
5.అనువాదపద్యమ్ - శ్రీ ముదిగొండ నాగరాజు శర్మ గారు
6.దృశ్యమ్ - శ్రీ మల్లావజ్జుల చంద్రశేఖర్ శర్మ గారు
7.ఆశుకవితా - బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు
8.అంత్యాద్యక్షరా - శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు

అవధాని ప్రార్ధన
ప్రార్థనాశ్లోకా: !
🍁🍁🍁🍁
సిద్ధిబుద్ధిప్రదం దేవం
సంతతాభీష్టదాయకమ్
రామారెడ్డిపురాధీశం
వందే విఘ్నవినాశకమ్ !

బ్రాహ్మీస్వాంతసరోవరప్రవిలసత్ శ్రీరాజహంసో విధి:
లక్ష్మీభాసితదుగ్ధసాగరశయ: శ్రీచక్రధారీ హరి:
గౌరీమానసజాహ్నవీవిహరణశ్చంద్రప్రభాశేఖర:
పాయాసుర్మహితావధానకలనా: సాహిత్యలోకం సదా !

ఇదం కవిభ్య: సర్వేభ్యో
నమోవాకం ప్రశాస్మహే
దృశ్యశ్రవణషద్గోష్ఠీ
పృచ్ఛకేభ్య: ప్రమోదిత: !

దృశ్యశ్రవణసాహిత్య
సంధానానందనందన:
జీయాత్ సేవామనోభావ:
యశస్వీ కృష్ణమోహన: !

భారతీ భాతు మద్వాచి
భారతీ భాతు మే హృది
భారతీ భాతు మద్గేహే
భారతీం ప్రణమామ్యహమ్ !

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మమాగమనం , ప్రార్థనశ్లోకపఠనం చ పర్యాప్తమ్.ఇదానీమహమభ్యర్థయే పృచ్ఛకాన్ స్వీయప్రశ్నాన్ దాతుమ్ !


సభాయైనమః
అవధానిగారికి నమస్కారములు
నా పేరు డా.మాడుగుల భాస్కర శర్మ
అష్టావధానములో
నేనిచ్చే అంశం
నిషేధాక్షరీ
..................
మేషాది రాశుల వర్ణన
మ,వ,క,స లు నిషేధం


అవధాని పూరణ: నిషేధాక్షరీ:
🍁🍁🍁
అజభద్రయుగాఅప్చర
హరియోషాతౌలనాళిచాపశిశుఘ్నమ్
ఘటఝషభాగతరాశి:
భరణీయం భాతి భాగణే గణనీయే !


నమస్సభాయై మమనామ ముత్యంపేట గౌరీశంకర శర్మ అంశం:- సమస్య  *గౌరీనేచ్ఛతి శంకరస్య వదనం ద్రష్టుం శరద్యేకదా *

అవధాని పూరణ: సమస్యా:
🍁🍁🍁
ఈశం ప్రాప్తుమగణ్యఘోరతపసా సంతాపితే భూధరే
ఈశం నిందితుమాగతం వటుమహో దృష్ట్వా హిమాద్రేస్సుతా
వైముఖ్యం ప్రకటీకృతా శివపరధ్యానా తదజ్ఞానత:
గౌరీ నేచ్ఛతి శంకరస్య వదనం ద్రష్టుం శరద్యేకదా !


ఆయాచితం కులోత్పన్న 
రస ధారా ధరాన్విత అవధాన విధానేస్మి న్    స్వీకురుష్వఅభివందనమ్
డా ముదిగొండ

నమస్సభాయై మమనామ ముదిగొండ అమరనాథశర్మ
అంశః దత్తపది
వ్యాస వాల్మీకి భాస కాళిదాస అనేన పద చతుష్టయేన సంస్కృత  భాషా  ప్రాశస్త్యం

అవధాని పూరణ: దత్తపదీ:
🍁🍁🍁
వాల్మీకివచనానందా వ్యాసభారతరాజితా
భాసనాటకసంభాసా
కాళిదాసకథాత్మికా
భాసతే విశ్వకల్యాణీ
భారతీ సంస్కృతాభిధా
దేవవాణీతి సంఖ్యాతా
భారతే ధర్మగీరతే !



నమఃసభాయై🙏🏻
అవధాని మహోదయానాం నమాంసి భూయాంసి
మమనామ: యం మల్లికార్జున శర్మ
అద్య వర్ణనాంశే
"దక్షిణామూర్తి స్వరూపం" స్వేచ్చా ఛందే వర్ణయంతు

అవధాని పూరణ:: వర్ణనమ్ :
🍁🍁🍁
దర్పణే దర్శితం యేన
సర్వం విశ్వం చరాచరమ్
తం వందే దక్షిణామూర్తిం
మేధాజ్ఞానవివర్ధకమ్ !



పద్య పూరణలు: ముదిగొండ నాగరాజ శర్మ
అంశః పద్య అనువాదం

చడువనివాడు అజ్ఞునడగు
చదివిన సదశద్వివేక చతురత గలుగున్
చడువగ వలయును జనులకు
చదివించెద నార్యులొడ్డ చదువుము తండ్రీ


అవధాని పూరణ: అనువాదపద్యమ్ :
🍁🍁🍁🍁🍁
అపఠన్ ప్రభవతి మూఢ:
పఠనేన సదసతోర్వికాసం లభతే
పఠనమవశ్యం జగతే:
పాఠయితుం నేష్యతే సుపుత్ర! పఠ భృశమ్ !



అవధాని మహోదయానాం నమాంసి భూయాంసి
మమనామ: మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ
సర్వేషాం అహం అభివాదయామి
మయా దత్త అంశః
దృశ్యం

ప్రసిధ్ధ హరిద్వార గంగాక్షేత్రే
తీర్థయాత్రీనాం సందర్శన రహితకారణేన
నిర్మలవాతావరణం అస్తి.
ఏతద్ దృశ్యం
వర్ణయంతు ఇతి ప్రార్థయామి
సంస్కృత భాషేన భావవ్యక్తీకరణ జ్ఞానం నాస్తి
తత్కారణేన మాతృభాషాయం ప్రసంగిత చలనచిత్ర ం ఆహం ప్రధర్శయామి
క్షమ్యతాం


అవధాని పూరణ: దృశ్యమ్:
🍁🍁🍁
భాగీరథీ నిర్మలవాహినీయం
కాలుష్యతాం ప్రాప్తవతీహ పూర్వమ్
యాత్రాజనాభావతయా హి సాద్య
స్వచ్ఛప్రవాహా లసతే నితాంతమ్ !



ఆశువు అంశానికి ప్రశ్న

ఘోరకరోనా విలయం కన్నా మనిషిలోని క్రౌర్యమే హేయమని ప్రకటిస్తూ నిన్న అతి క్రూరంగా , కిరాతకంగా సాధువులను కొట్టి చంపిన దుర్మార్గాన్ని నిరసిస్తూ ఒక శ్లోకం చెప్పండి.
       .....మరుమాముల దత్తాత్రేయ శర్మ

అవధాని పూరణ: ఆశుకవితా:
🍁🍁🍁🍁
భయం నాస్తి కరోనాయా:
మనుష్యాత్ హీనవర్తనాత్
భయమద్య జనాన్ హంతి
మానవీయపథచ్యుతమ్
పాల్ఘార్ స్థానీయదుష్కృత్య
లజ్జితం హ్యద్య భారతమ్
దుష్టశిక్షా ప్రకర్తవ్యా
శిష్టరక్షణకాంక్షిభి: !



అంత్యాద్యక్షరి
అమరవాది రాజశేఖర శర్మ

అపి స్వర్ణమయీ లంకా- న మే రోచతి లక్ష్మణా,
జనని జన్మభూమిస్చ స్వర్గాదపి గరీయసి ".

అవధాని పూరణ:: అంత్యాద్యక్షరా :
🍁🍁🍁🍁🍁
సీతాయాశ్చరితం సర్వం
రామగాథాప్రపంచితమ్
తస్మాదేవ హి సాహిత్యే
రామగాథా గరీయసీ !

అభినందనలు


[22/04, 6:02 PM] Poet Mallavajjula Chandra Shekar: సంస్కృతాంధ్రములందు సత్పండితులుమీరు
సవ్యసాచిగజూపి సత్పథమును

అవధానమునుబెంచు నద్భుతవిషయాలు
నందజేతురుమాకు సుందరముగ

సాధుమానసమున బాధనొందించక
స్పందనలిత్తురా నందముగను

వచనకవితలను పద్యరాజములను
ఘనముగాగురిపించు కలముమీది

శ్రీ నటేశ్వరశర్మ గసృష్టిజేయ
రెన్నియోపద్యకవితలుమన్ననొంది
కలమునటరాజుగానిల్చికావ్యమందు
చిందులేయగా రచనలు సుందరమ్ము


[22/04, 6:17 PM] Poet Madugula Narayana Murty Buf: అద్భుతపూరణజేసిన
సద్బుధుడునటేశశర్మసంస్కృతమందున్
సద్భావనలింపార;ర
విద్భాసురకీర్తినింపె విద్వణ్మణియై


[22/04, 6:27 PM] Poet Madugula Bhasker Sharma Buf: నా స్పందన -వందనం
..............................
పురుషసద్వాణి సద్రూపం
సాహిత్యాంబుధి శోధితం
సంస్కృతాంధ్ర మహావక్తారం
నటేశ్వర గురోర్నమః
అష్టావధాన సంపన్నం
అద్భుతానందదాయకం
సాహితీ కదనోత్సాహం
సతతం దర్శితం శుభమ్.
...డా.మాడుగుల భాస్కర శర్మ

యూట్యూబ్ లింకు కొరకు
https://youtu.be/WcVwX6Lf7fY

మీ
భవధీయుడు
గోగులపాటి కృష్ణమోహన్

స్వస్తి

Tuesday, April 21, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 4

దృశ్య శ్రవణ అష్టావధానము - 4
(సంస్కృతావధానము)

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము,
ఉత్తరాయణం, వసంతృతువు,
చైత్ర మాసం, కృష్ణ-చతుర్దశి,
మంగళవారం, తేది 21-04-2020

అవధానవర్యులు

బ్రహ్మశ్రీ డా|| ముదిగొండ అమరనాథశర్మ గారు

సంయోజకులు

అవధానతిలక
బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకరశర్మ గారు

నిర్వహణ

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

*అంశాలు*
సమస్య : శ్రీ ముదిగొండ నాగరాజు శర్మ గారు
దత్తపది : శ్రీ ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు
వర్ణన : బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ
ఆశువు : శ్రీ పార్వెళ్ళ శ్రీధర శర్మ గారు
పద్యానువాదం  : శ్రీ అమరవాది రాజశేఖర శర్మ గారు
నిషిద్దాక్షరి : శ్రీ నిర్మల సిద్దిరామ శర్మ
అంత్యాద్యక్షరీ : శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారు
దృశ్యం : శ్రీమతి లక్ష్మీమదన్ గారు

సంయోజకులు
అద్య సాయం సప్తవాదన సమయే అవధాన కార్యక్రమః ప్రారభ్యతే । స్వీయఅంశైః సర్వే ప్రాశ్నికాః సన్నద్ధాః భవంత్వితి ప్రార్థయే  !

స్వాగతం
ముదిగొండసుధాంభోధి
కవిచంద్రో విరాజతామ్
వధాన్యమరనాథాఖ్య:
కవనోత్సవతత్పర: !
బ్రహ్మశ్రీ డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మా

సంయోజకులు
ముదిగొండ వంశగుణధీ !
సదమలయవధానకవనసాహిత్యనిధీ!
పదములు వేయగ రమ్మా !
హృదయావిష్కరణజేయనుత్సాహముతో !


అవధాని ప్రార్ధన


సమస్య

శ్రీ ముదిగొండ నాగరాజ శర్మ

మమ సమస్యా శ్లోకపాధం
కాళిదాస కవితా దరిద్రతా



పూరణ
యస్యనాస్తి ఖలు శబ్ద చింతనా
కావ్య భావ్య రసరమ్య భూషణా
తస్య జీవన విధౌచ దృశ్యతే
కాళిదాస కవితా దరిద్రతా

ఆశు అంశః

శ్రీ పార్వెళ్ళ శ్రీధర శర్మ


ఆశు అంశః
దృశ్య,శ్రవణ అష్టావధాన  సద్గోష్ఠీం  అధికృత్య వర్ణయన్తు ఇతి ప్రార్ధయామి

పూరణ
దృశ్యే శ్రావ్యే నవరసయుతే తేవ్యదష్టావధానే
రమ్యే భవ్యే సరసిలసితే
ప్రాశ్నికజ్ఞానగమ్యే
నవ్యే సవ్యే సురుచిరపదైః కృష్ణమోహన్ ప్రదీప్తౌ
దేయాన్నిత్యం పరమ సుఖదా శారదా మంగళంవా


దత్తపది

శ్రీ మల్లికార్జున శర్మ

అవధాని మహోదయస్య నమాంసి భుయాంసి 🙏🏻 
మమనామ యం.మల్లికార్జున శర్మ
మమ అంశం:దత్తపది
ఆశా
పాశం
నాశః
కాషాయ
ఏతాని పదాని ఉపయుజ్య "కరోన" నిర్మూలనాయ పరమేశ్వరస్య ప్రార్థనాం కుర్వంతు👌👏ధన్యవాదాః

  ***********************
పూరణ
నాశంకరోనాం కురు దేవదేవ
ఆశాంప్రజాభ్యః సుఖజీవనాయా
పాశం ప్రపంచే విధివచ్ఛ ఛిత్వా
కాషాయ రాజ్యస్య శుభాని దత్వా


దృశ్యం

శ్రీమతి లక్ష్మీమదన్

అవధాని గారికి  ప్రణామములు
పేరు : లక్ష్మీ మదన్, హైదరాబాదు
అంశము : దృశ్యము

అందరికీ ఎంతో కొంత దానం చేయాలని ఉంటుంది....దానం చేసినది గోప్యంగా ఉంచాలా! లేక నలుగురు స్ఫూర్తి పొందగలరని చాటాలా! దీనిని స్వేచ్చా చందం లో మీ అభిప్రాయం తెలపండి .

పూరణ
ఏకత్రదానేనచ త్యాగ వృద్ధిః
అన్యత్ర దానేనచదివ్య స్ఫూర్తిః
భుజ్యాచ స్ఫూర్త్యా భువి మానవాశ్చ
లోకే ప్రసిద్ధిన్ ఖలు ప్రాప్నువంతి


అంత్యాద్యక్షరీ 

శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారు

నమస్సభాయై
మమ నామ డా.మాడుగుల భాస్కర శర్మ
కాళేశ్వర గ్రామస్య నివాసీ అస్మి.
అవధాన ప్రాశ్నికాంశః
అంత్యాద్యక్షరీ
........................
యాకుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యావీణా వరదండ మండితకరా
యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః
దేవైస్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ
భగవతీ నిశ్శేష జాడ్యాపహా !

పూరణ..
హవ్యం భవ్యం ప్రబలగదితం చోద్భవేశంసురేశం
సవ్యం సౌఖ్యం సముచితపదం చారుచంద్రావతంసం
కవ్యం కావ్యం కరుణ గుణదం కావ్యగానప్రీయంతం
శ్రీవిశ్వేశం పరమ సుఖదం భావయేద్భక్తి గమ్యం



నిషిద్ధాక్షరీ
శ్రీ నిర్మల సిద్ధిరామ శర్మ

నిషిద్ధాక్షరీ
శ్రీ,య,మా,భ
..................
శ్రీ నిర్మల సిద్ధిరామ శర్మ
కరోనా రోగ సంక్రమణ భయాత్ సర్వే పరివార సభ్యాః స్వస్వ గృహేషు
నివసన్ మాతా పితృ గురు దేవతా భక్తియుతాః
సదాచార రతాః‌,
రోగస్య సంపూర్ణ నాశానంతరం అభి ఏవమేవ భవేయు ఇతి
ప్రజా సందేశాత్మకం శ్లోకం స్వేచ్ఛా వృత్తే శ్రావయతు

పూరణ
విషజ్వర సమాప్తేపి
స్నేహపూర్వక చింతనా
రాజతాత్  రాగదాసాచ
రాజేశ్వర కృపా వశాత్
.....

పద్యానువాదం

శ్రీ అమరవాది రాజశేఖర శర్మ

శ్రీ అమరవాది రాజశేఖర శర్మ
పద్యానువాదం
.........................
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ !

పూరణ
 భూమిర్మమేతి విషయే
రసా హసతి సర్వదా
తథైవ దాన హీనేచ
కదనే కామ సంపదౌ

వర్ణన

శ్రీమరుమామల దత్తాత్రేయ శర్మ

వర్ణన..మరుమాముల దత్తాత్రేయ శర్మ

కరోనా జనులందరికీ భయంకరోనా గా మారినప్పటికీ
నదీనదాలు స్వచ్ఛమైనాయి. పశుపక్ష్యాదులు స్వేచ్ఛను పొందాయి.
ఈ అంశాన్ని మత్తేభవృత్తంలో వర్ణించండి.
..............
పూరణ
..............
రమణీయామృత వృక్షశాఖ విభవే
స్వేచ్ఛావృతాః పక్షిణః
కమనీయామృత ధారయాచ సలిలం
సద్యోరసాప్లావితం
రమణీయామృత పద్య గద్య మహిమా
రారాజతాత్ సర్వదా
స్తవనీయామృత దుష్కరోన సమయే
తృప్తాశ్చ ధన్యాః ప్రజాః

ఆసత్యలోకదాశేషు
దాలోకలోకపర్వతాః
యేసంతిబ్రాహ్మణాదేవా
తేభ్యోనిత్యం నమోనమః

స్మార్టు ఫోనులోడౌన్లోడసాధ్యమయ్యె
భాష వేషము మాయమై బాధకలిగె
పండితోత్తములందరునిండుకొనగ
దృశ్య రూపమేచూడగా దివ్యమిచట
శ్రీ మల్లావజ్జుల చంద్రశేఖర్ శర్మ 

మరుమాముల దత్తాత్రేయ శర్మ:
చూచి వినుచు మాటాడెడు చోద్య విద్య
దృశ్య సుశ్రావ్య మవధాన ధిషణ యందు
సంస్కృతాంధ్రభాషా విభూషలుగ కవన
మధురిమల్ పంచుచు కరోన మాడిపోవ
ప్రతిభ ప్రకటించు ముదిగొండ వంశ మణిని
పండితామరనాథు వాక్పటిమ మెత్తు!

దత్తపది పదాల పూరణ బావుంది,చక్కగా పదాలను అమర్చి  చక్కటి శ్లోకం అందించిన అవధాని డాక్టర్ అమరనాథ శర్మ గారికి,ఇంత మంచి కార్యక్రమాన్ని రసవత్తరంగా నిర్వహించిన కృష్ణమోహన్ అన్నయ్య గారికి ప్రత్యేక అభినందనలు,💐నమస్కారములు👏🙏🏻🙏🏻🙏🏻

ముదిగొండ నాగరాజు

Sreeyamaranaadhaakhya మహావధానినం సుష్లోక సుగ్నాన విధానవంతం
గీర్వా న saahityavikaasavantam
తం noumipragnaaanapraceepayantam


సంస్కృత అష్టావధానము బ్ర.శ్రీ .డా.ముదిగొండ అమరనాథ శర్మ గారు
అత్యంత అద్భుతముగా చేశారు.
ఎందరో మహానుభావులు ఇందులో పృచ్ఛకులుగా ఉన్నారు. బ్ర.శ్రీ. ముత్యంపేట గౌరీశంకర శర్మగారు ఎంతో గొప్పగా సంయోజకత్వం జరిపారు..శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ శర్మగారు
నిర్వహణ‌,దర్శకత్వం సర్వం తానై కవులందరినీ ఏకత్రాటిపై నడిపి సర్వోత్కృష్టం గా సంస్కృతావధానాన్ని
సాఫల్యం చేశారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా
హృదయ పూర్వకంగా
కృషి చేసీన వారందరికీ అభినందనలు.ధన్యవాదములు.
మాడుగుల భాస్కరశర్మ
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽



యూట్యూబ్లింలిం కోసం
https://youtu.be/snWTqDyoC1o

మీ
గోగులపాటి కృష్ణమోహన్
నిర్వాహకులు

స్వస్తి

Monday, April 20, 2020

దృశ్య శ్రవణ అష్టావధానము - 3

దృశ్య శ్రవణ అష్టావధానము - 3*

స్వస్తిశ్రీ శార్వరీ నామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర బహుళ ద్వాదశి, ఆదివారము.
తేది: 19-04-2020, ఆది వారము

అవధాని


బ్రహ్మశ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు


సంయోజకులు

శ్రీ గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు


నిర్వహణ 

శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

*పృచ్ఛకులు*
సమస్య : *శ్రీ మాడుగుల భాస్కర్ శర్మ గారు*
దత్తపది : *బ్రహ్మశ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు*
వర్ణన : *శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు*
ఆశువు : *శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు*
అప్రస్తుతం : *శ్రీ మల్లావజ్జుల చంద్రశేఖర్ శర్మ గారు*
అంత్యాద్యక్షరీ : *బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు*
దృశ్యం : *డా|| రామక కృష్ణమూర్తి గారు*
న్యస్తాక్షరి : *శ్రీమతి పద్మ చిగురాల గారు*

అవధాని ప్రార్థనా శ్లోకాలు
శ్రీ గణనాయకస్తుతితో
వాగనుసంధానరాణివాణినిగొలువన్
స్వాగతమందునుపెద్దలు
రాగముజూపించిగాచ రయ్యలు కృపతో.

2.తల్లినిదండ్రినివేడెద
నుల్లములోనున్నయట్టి యొజ్జల నెల్లన్
కల్లాకపటములెరుగని
చల్లని హృదయాల గొలుతు సాకగ నన్నున్

3.దృశ్య శ్రవణాల మాధ్యమ దీప్తి గరిమ
వెలుగును నష్టావధానమ్ము తెలుగు జిలుగు
వాణి యలివేణి వాహక శ్రేణి లోన
వందనమ్ములు పృచ్ఛక వర్యులార!!

దృశ్య శ్రవ్య అష్టావధానం-3

నాపేరు డా.మాడుగుల భాస్కర శర్మ, కాళేశ్వరం
అంశము : సమస్య
.............................
కన్యకు యేడుకన్నులను గాంచి వరుండట మెచ్చె వెంటనే.


సమస్యాపూరణము
అవధాని గారి పూరణ

మాన్యుల సృష్టి హార్మొనిగ మాధురిగీతల నిండు వేడుకై
ధన్యము జేయు జీవితము ధారగ పాటలు సంతసమ్మునై
అన్యుల శ్రావ్యగానముల నంకిత దృష్టిన రాగమాలికల్
కన్యకు యేడుకన్నులను గాంచి వరుండట మెచ్చె వెంటనే.





డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.

అవధానిగారికి

 పై దృశ్యాన్ని చూసి మంచి సందేశాత్మక పద్యాన్ని,మీ స్వేచ్ఛావృత్తంలో చెప్పగలరని మనవి.

అవధాని గారి పూరణ
దృశ్యం:
వైద్యులు ప్రజలను గాచగ
వేద్యులు క్రైస్తవులు హిందు విజ్ఞులు కలువన్
బాధ్యులు ముస్లిలొకటై
ఆద్యంతము గౌరవించిరాదర మొప్పన్.



నాపేరు:- ముత్యంపేట గౌరీశంకరశర్మ
అంశం:- అంత్యాద్యక్షరీ
పద్యం:- సుధలన్ జిందెడి చందమామతలపై శోభిల్ల విశ్వంభరన్
మధురానంతరసప్రపూరణజగతిన్ మాన్యంబుగాజేసి స
ద్బుధతన్ లోకులకీయగల్గుఘనుడౌ పూజ్యుండు వెమ్లాడ పె
న్నిధియైవెల్గెడు రాజలింగని పదంబేగొల్తు వాక్సిద్ధికై ....

అవధాని గారి పూరణ
అంత్యాదక్షరి:-
కైమోడ్చెదనవధానికి
ధీమతుడీ శంకరన్నదీప్తికి సతమున్
నేమము నిష్ఠల బుధునికి
ప్రేమగనంత్యాక్షరంపువేల్పుకు సతమున్



నాపేరు: *మాడుగుల మురళీధర శర్మ*  *సిధ్ధిపేట*          ఈరోజున నిర్వహించబడు దృశ్య శ్రవణ అష్టవధాన కార్యక్రమానికి స్వాగతం! సుస్వాగతం!               
ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పంథాలో పుంతలు త్రొక్కిస్తూ నిర్వహిస్తున్న సాహితీ లోకావధాన విస్తారకక్రియా బంధు
బ్ర.శ్రీ.గోగులపాటి కృష్ణమోహన్ గారికి, సంయోజకులు బ్ర.శ్రీ.గుళ్ళపాటి కాంతి కృష్ణగారికి,
వర్ధమాన యువావధాని
బ్ర.శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారికి స్వాగతం,సుస్వాగతం.           
ఈరోజున  పృఛ్ఛకునిగా నాకు ఇచ్చిన

అంశం: వర్ణన.                     
నేనిచ్చే వర్ణనాంశం:                       
*త్రిలింగ క్షేత్రమైన,త్రివేణీ సంగమమై విరాజిల్లుతున్న  కాళేశ్వరం క్షేత్రములో ఒకే పానవట్టముపైవున్న
*శ్రీకాళేశ్వర-ముక్తీశ్వరస్వామివారు  శుభానందాదేవిలపై* స్వేచ్ఛా వృత్తంలో వర్ణించాలని  అవధానిగారిని కోరుతున్నాను.
     *ధన్యవాదములు.*

వర్ణన అంశానికి-
అవధాని గారి పూరణ

వ్యాళవిభూషాదేవా!
కాళీ కేళీవిలాస* గౌతమి వాసా!
భోళాశంకర బ్రోవర
కాళేశ్వరముక్తినాథ* కరుణాభరణా!



 అష్టకాల విద్యాచరణ్
*ఆశువు - కుచేల స్నేహ ధర్మం

పద్యం:* కుచేల స్నేహ ధర్మం
అవధాని గారి పూరణ

పేద సాదలనగ బేధము లేనిది
స్నేహగీతి ప్రజల చేరువగును
ప్రేమ పంచె కృష్ణ వీక్షణ వరము భూ
సురకుచేలునేలె స్తోత్ర విధిన



దత్తపది
అవధాని గారు మతి,గతి,పతి, సతి, ఈ నాలుగు పదా లతో మీ,అవధాన అనుభూతిని వర్ణిచండి డా ముదిగొండ అమరనాథశర్మ


మల్లావజ్జుల చంద్రశేఖర శర్మ గారు

అప్రస్తుతం  1
అవధానిగారికి నమస్కారం
గతపదిరోజులగా రామాయణకథలో
రాముడెదుర్కొంటున్న సమస్యలో లక్ష్మణుడు
చేదోడుగా ఉన్నాడు
ఈరోజు
మీ సోదరుడేమీకు సమస్య

మీ సమాధానం
ఏమిటి

అవధాని గారి సమాధాము...
మా సోదరులు నాకు దక్షిణామూర్తి సమానులు... సమస్య వారే... సమాధానమూ వారే...

అప్రస్తుతం  2
లాకుడౌనులోన లాస్యప్రియులుమీరు
యింటిలోననుండి యిష్టముగను
యేమి చేయుచుంటి రేమనకుండగా
ధర్మపత్నిమెచ్చు దారిగనుచు

అవధాని గారి పూరణ
అమ్మాశతకమువ్రాసితి
నెమ్మదిగానింటిలోననేస్తముదయితై
కొమ్మలఫలములెగద
మమ్ములనీస్థాయినిలుపుమహిసహనమునై



అవధాని గారికి నమస్సులు.🙏🏻
పేరు : పద్మ చిగురాల, హైదరాబాదు
అంశము : *న్యస్తాక్షరి...*

రామరక్ష  అక్షరాలను

*రా* మొదటి పాదంలో మొదటి అక్షరం
*మ* రెండో పాదంలో నాలుగో అక్షరం
*ర* మూడో పాదంలో నాలుగో అక్షరం
*క్ష* నాలుగో పాదంలో ఐదో అక్షరం
 
🙏🏼పద్మ చిగురాల🙏🏼
అవధాని గారి పూరణ
అంశము...న్యస్తాక్షరి
కం.
రామునిదలచ కరోనా
భామను మంత్రించి చంప వైద్యుని రీతిన్
సీమల రక్షణజేయగ
రాముడ దీక్షల కనుగొనగ రారా భువికిన్.
ప్రశంసాపూర్వక అభినందనలు

అవధాని: అత్యద్భుతంగా అవధానాన్ని నిర్వహించినశ్రీ మాడుగుల నారాయణమూర్తిగారిని అభినందిస్తు ....
శ్రీమాడ్గులాఖ్యవరవంశసుధాకరాయ
అష్టావధానకలనాసువిశేషణాయ
నారాయణాయ కవయే శుభమాశుదద్యాత్
రాజేశ్వరః ప్రథిత వేములవాడ వాసః 👏🌸😊🌺ముత్యంపేట గౌరీశంకర శర్మ


సోదరుడైన మూర్తి బహు సుందరమౌ యవధాన విద్యలో
మోదము గల్గుతీరు కవి ముఖ్యుల ముందిట ధారణాంగుడై
రాదను పల్కులేక జన రంజకమైన కవిత్వ శైలిలో
నాదము జేసె ,దీవనలు నారయ తమ్ముని కందజేసెదన్.
..డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ


అభినందనలు

దృశ్యశ్రవ్య అష్టావధానం 3వ రోజు కూడా అద్భుతంగా శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారు మాడుగుల నారాయణ మూర్తి తో చేయించారు.
శ్రీకాంతి కృష్ణ గారు అనుసంధానం చేశారు.
అవధానం సఫలీకృతం.

సోదరుడైన మూర్తి బహు సుందరమౌ యవధాన విద్యలో
మోదము గల్గుతీరు కవి ముఖ్యుల ముందిట ధారణాంగుడై
రాదను పల్కులేక జన రంజకమైన కవిత్వ శైలిలో
నాదము జేసె ,దీవనలు నారయ తమ్ముని కందజేసెదన్.

..డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ

దారయు ధైర్యము నిండుగ
ధారణతోకదలెనేడు తాదాత్మ్యముతో
పూరణచక్కగచేయగ
నారాయణశర్మగెలిచె నలుగురిమనసుల్
- మల్లావజ్జుల

అష్టకాల విద్యాచరణ్ స్పందన..
అలవోకగపూరణలను
అలసాగెడు పడవ రీతి నందించెనుగా
అలుపెరుగని యవధానిగ
కలిమిని యిక పంచు వాణి కామేశ్వరియై

అష్టకాల విద్యాచరణ శర్మ🙏🙏🙏


 అవధానిగారు శ్రీ మాడుగుల నారాయణమూర్తి గారు బహురమ్యంగా అష్టావధానాన్ని నిర్వహించారు.మంచి ధారతో,ధారణతో,పాండిత్యంతో అంశాలను పూర్తిచేసిన వారికి అభినందనలు.అలవోకగా,చక్కని వివరణలతో ఆద్యంతమూ ఆసక్తికరంగా నేటి అవధానం సాగినది.నిత్యావధాన క్రతువు అవధానుల యాజ్ఞికంతో విజయవంతంగా కొనసాగుచున్నది.గోగులపాటి కృష్ణమోహనన్నకు కృతజ్ఞతలు🙏
రామక కృష్ణమూర్తి

మాదుసహోదరుండునిట*
మాన్యతగానవధానికాగతా
కీదుమహోజ్వలంపునవ*
కీర్ణరసార్ణవపద్యధారణా!
గాదిగ తావిరాజమగు*
కాంతిప్రభల్విరజిమ్మునట్లుమా
సోదరుకాశిసుల్నిడెద*
సుందరదృశ్యపుటావధానమున్!

శుభాశీస్సులతో....
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట

స్వస్తి
మీ
గోగులపాటి కృష్ణమోహన్
నిర్వాహకులు

యూ ట్యూబ్ లింక్ కొరకు

https://youtu.be/54njnnYQqqQ